A9న్యూస్ ఇందల్వాయి:

 

ఇందల్వాయి మండలం లోని 7 రోజుల పాటు భారీ వర్షాలు ఎంపీడీవో అనంతరావు

నిజామాబాద్ జిల్లాలో రాగల ఏడు రోజులపాటు భారీ వర్షాలు ఉన్నందున నిజామాబాద్ జిల్లాను రెడ్ అలర్ట్ గా ప్రకటించడం జరిగిందన్నారు. పంచాయతీ కార్యదర్శులు తమ తమ గ్రామ పంచాయితీ హెడ్ క్వార్టర్స్ నందు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.వర్షాలకు నివాస గృహములు కూలుటకు ఆస్కారమున్న గృహాలను గుర్తించి అట్టి కుటుంబాలను వేరే వేరే గృహములకు లేదా ప్రభుత్వ భవనములకు మార్చాలన్నారు. గ్రామములోని ఐరన్ పోల్స్ ,స్తంభాలను గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయవలసినదిగా తెలిపారు. చెరువుల నీరు గ్రామాలలోనికి రాకుండా చర్యలు తీసుకోవాలాన్నారు. చెరువులు తెగిపోయే ఆస్కారం ఉంటే వెంటనే గుర్తించి పై అధికారులకు తెలియ చేయాలన్నారు. నూతనంగా కట్టడాలలో ఉన్న రోడ్డు ఏరియా బ్రిడ్జిల వద్ద క్రింది నుండి వేసిన మట్టి రోడ్డు తెగిపోవుటకు ఆస్కారం ఉన్నందున ప్రజలను వెళ్లకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. చేపలు పట్టడానికి ప్రజలను వెళ్లకుండా చూడాలన్నారు..ప్రమాదాలు జరిగితే వెంటనే పై అధికారులకు సమాచారం ఇవ్వలని పేర్కొన్నారు. గ్రామాలలో గుంతలు గుర్తించి నీరు నిల్వకుండ చూసి సమస్యను పరిష్కారమయ్యే విధంగా చూడాలన్నారు. గ్రామ పెద్దల ద్వారా సమాచారం తెలుసుకుంటూ ఉండాలన్నారు. ఎక్కడైనా త్రాగునీరు లీకేజీ జరిగితే వెంటనే రిపేర్ చేయించాలని సూచించారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *