A9 న్యూస్ ఆర్మూర్:
అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన అగ్రికల్చర్ పాలిటెక్నిక్ విద్యార్థికి న్యాయం చేయాలి మృతికి కారకులైన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలి – ప్రిన్స్ డిమాండ్
ఆర్మూర్ పట్టణ కేంద్రలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్యు) ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో పీ.డి.ఎస్.యూ కార్యాలయం లో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పిడిఎస్యు ఆర్మూర్ డివిజన్ అధ్యక్షులు ప్రిన్స్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా, బోధన్ డివిజన్, అక్బర్ నగర్ గ్రామ కేంద్ర లో ఉన్న అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలలో శనివారం 31-08-2024 రోజున అనుమానస్పద స్థితిలో హాస్టల్ బాత్రూంలో చనిపోయిన విద్యార్థి రక్షిత మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అని అన్నారు. అక్కడున్న సీసీ కెమెరాలు అదే రోజు పనిచేయకపోవడం, కుటుంబ సభ్యులు రాకముందే అమ్మాయి మృతదేయాన్ని హాస్పిటల్ కు తరలించడం చూస్తుంటే పోలీసులు అధ్యాపకులు కలిసి లోపకారి ఒప్పందానికి పాల్పడ్డట్టు అనుమానాలు వస్తున్నాయి, దీని వెనకాల ఉన్న వారు ఎవరైనా వదలకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నత అధికారులకు కోరుతున్నాం అదేవిధంగా చనిపోయిన అమ్మాయి కుటుంబానికి ప్రభుత్వం 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా విద్యార్థిని మృతికి కారకులైన వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలని వారు కొరకు లేనిపక్షంలో విద్యార్థిని కుటుంబానికి న్యాయం జరిగేవరకు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటేష్, కైఫ్, భారత్ తదితరులు పాల్గొన్నారు.