A9 న్యూస్ ప్రతినిధి ధర్పల్లీ:
ప్రగతిశీల మహిళా సంఘం పిఓడబ్ల్యూ, తెలంగాణ రాష్ట్ర ఏడవ మహాసభలు ఆగస్టు 31 నా ఉదయం 10 గంటలకు విఎన్ టి నుండి ఇందిరా పార్కు వరకు మహిళల భారీ ప్రదర్శన, అనంతరం ఇందిరా పార్కులో బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రగతిశీల మహిళా సంఘం పిఓడబ్ల్యు డివిజన్ కార్యదర్శి వి.పద్మ తెలిపారు.
సెప్టెంబర్ 1, 2వ తేదీలలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాగు లింగంపల్లి లో రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన మహిళ ప్రతినిధులతో మహాసభలు జరుగుతాయి అన్నార్.
మహాసభలకు రాష్ట్ర అధ్యక్షురాలు జి.ఝాన్సీ ముఖ్య వక్తగా ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ అధ్యక్షురాలు డాక్టర్: అపర్ణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎం.లక్ష్మి, పి ఓ డబ్ల్యు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, డా సరిత పిట్ల, POW రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అందే మంగా, తదితరులు పాల్గొంటారని వి.పద్మ తెలిపారు.
ఈ మహాసభలో నాటి మహాసభ నుండి నేటి వరకు జరిగిన ఉద్యమాన్ని సమీక్షించుకొని రాష్ట్రంలో బలమైన మహిళా ప్రజా ఉద్యమాలను నిర్వహిచడానికి కార్యచరణ రూపొందించుకుంటామని ఆమె అన్నారు.
మహాసభకు వెళ్లిన వారిలో వి.పద్మ, నిమ్మరాజుల లాస్య, లక్ష్మి నర్సవ్వ, మందపురం సత్యవ్వ, మల్కి రామలత, గంగుల సునీత, పీట్ల కళ్యాణి, పిట్ల లక్ష్మి, రాధ తడమంచు, తదమంచు అనిత, గంగసాయమ్మ, పిట్ల ఎల్లయ్య, సాంబయ్య తదితరులు బయలుదేరారు.