*భీంగల్ పట్టణ మరియు మండల ప్రజలకు భీంగల్ పోలీస్ వారి తరపున విజ్ఞప్తి..!*
సదాశివ్ A9:న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం
సెప్టెంబర్ 01:భీమ్ గల్
మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర అల్పపీడనం శనివారం ఉదయం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ చేశారు.
*నిజామాబాద్ జిల్లా కూడా రెడ్ అలర్ట్ జాబితాలో ఉన్నది..*
👉నిజామాబాద్ జిల్లాలోని దాదాపుగా అన్ని మండలాలలో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ప్రజలకు పోలీస్ శాఖ వారి సూచనలు
👉 అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు ఇళ్లల్లో నుండి బయటకు వెళ్ళరాదు.
👉 రెడ్ అలర్ట్ వున్నందున ప్రయాణాలను 2-3 రోజులు వాయిదా వేసుకోవడం మంచిది.
👉 శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివాసం ఉంటున్న ప్రజలు, వారి వివరాలు సంబంధిత గ్రామ & మండల స్థాయి అధికారులకు తెలియపరచవలెను.
👉 రైతులు ఎట్టి పరిస్థితుల్లో వ్యవసాయ పొలాల వద్దకు వెళ్ళకూడదు.
👉 చిన్నపిల్లలను అస్సలు ఇంటి నుండి బయటకు రానివ్వద్దు
👉 విద్యుత్ స్తంభాలను ఎట్టి పరిస్థితిలో తాకరాదు.
👉 మోరీలు, నాళాలు, మ్యాన్ హోల్స్ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు జాగ్రత్త వహించాలి.
👉 అత్యవసర పరిస్థితి వస్తే తప్ప బయటకు రాకూడదు.
ఏదైనా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడితే. వెంటనే
*భీంగల్ SI నంబర్. 8712659866*
నెంబర్ కు లేదా Dial 100 కి కాల్ చేసి తెలియపరచగలరు.
G. మహేష్
సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్
భీంగల్ PS