A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్:
నిజామాబాద్ జిల్లా మూడవ మహాసభ బోధన్ పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపంలో జిల్లా అధ్యక్షులు ఏ.శాల గంగాధర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.
*వికలాంగుల సాధికారత కోసం ప్రత్యేక పథకాన్ని ప్రకటించాలి…
*అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ 6000లకు పెంచి వెంటనే అమలు చేయాలి…
*ప్రజల మౌలిక సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం…
*సమస్యల పరిష్కారం కోసం ఉద్యమలకు వికలాంగులు సిద్ధం కావాలి…
*ఎన్ పి ఆర్ డి నిజమాబాద్ జిల్లా 3వ మహాసభలో ఎన్.పి.ఆర్.డి రాష్ట్ర కార్యదర్శి యం అడివయ్య…
వికలాంగుల సంక్షేమం, సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాన్ని అమలు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్ పి ఆర్ డి) రాష్ట్ర కార్యదర్శి యం అడివయ్య డిమాండ్ చేశారు.ఈ రోజు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(ఎన్ పి ఆర్ డి) నిజామాబాద్ జిల్లా 3వ మహాసభ బోధన్ పట్టణంలోని టీటీడీ కల్యాణ మండపంలో జరిగింది.
ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరైన సంఘం రాష్ట్ర కార్యదర్శి యం అడివయ్య మాట్లాడుతూ దేశంలో తిండి లేక 10 కోట్ల మంది అల్లాడుతుంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని అన్నారు మోడీ పాలనలో నిరుద్యోగం పెరిగిందని అన్నారు. నిత్యావసర సరకుల ధరలు 300 శాతం పెంచి పేద, మధ్యతరగతి ప్రజలను ఇబ్బందులకు గురించేస్తున్నారని అన్నారు.జిఎస్టీ తీసుకువచ్చి ప్రజలపై భారలు వేసి సంపన్నులకు లక్షల కోట్ల రాయితీ ఇచ్చే హక్కు మోడీకి ఎక్కడిదాని ప్రశ్నించారు. పేదరికం తగ్గిందని చెపుతున్న మోడీ 81 కోట్ల మందికి ఉచిత బియ్యం పంపిణి ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వాలు 2014 వరకు 55లక్షల కోట్లు అప్పు చేస్తే, మోడీ పరిపాలించిన 10ఏండ్ల కాలంలో 113లక్షల కోట్ల అప్పు చేశారని, మోడీ పుణ్యాన దేశంలో ప్రతి ఒక్కరి తలపై 1,02,000 రూపాయల అప్పు పడిందని అన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణ రాష్ట్రంలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదని విమర్శించారు.10 లక్షల ప్రాథమిక ఉప వైద్య కేంద్రాలు ఉండాల్సిన చోట కేవలం లక్ష నలభై ఆరు కేంద్రాలతో అందరికి వైద్యం ఎలా సాధ్యం అవుతుందని ప్రశ్నించారు. ఏటా 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోడీ 10 ఏండ్ల కాలంలో కేవలం 7వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చామని పార్లమెంట్లో ప్రకటించరని అన్నారు.రైల్వేలో ఉడవడం, కడగడం లాంటి పనుల కోసం 35 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే 1.25కోట్ల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారని అన్నారు.
దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత వికలాంగులు పోరాడి సాధించుకున్న అనేక చట్టాలను రద్దు చేయాలని కుట్రలు చేస్తుంది.బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వికలాంగులపై దాడులు, మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయి వాటిని అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం చెందింది.ఇప్పటి 2016 ఆర్ పి డి చట్టానికి కమిషనర్ ను నియమించలేదు. నేషనల్ ట్రస్ట్ కు చైర్మన్ నియమించలేదన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళ సాధికారతను ప్రోత్సాహించేందుకు మహిళా శక్తి క్యాంటిన్ పథకాన్ని ప్రవేశపెట్టిందని అన్నారు. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో వికలాంగులకు 5 శాతం కేటాయించాలని ఉన్నప్పటికి మహిళా శక్తి క్యాంటిన్లలో ఎందుకు కేటాయించడం లేదన్నారు. మహిళా సాధికారత అంటే సకలాంగులైన మహిళల సాధికారత గురించి ఆలోచించడమే కాదని, మహిళా వికలాంగుల సాధికారత గురించి ప్రభుత్వాలు ఆలోచించాలని డిమాండ్ చేశారు. వికలాంగుల సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వికలాంగులు, వారి కుటుంబాలు దుర్భారమైన స్థితిలో ఉన్నాయని అన్నారు. వికలాంగుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవలని డిమాండ్ చేశారు. తీవ్ర వైకాల్యం కలిగిన వికలాంగులు, వారి కుటుంబ సభ్యులకు 25,000 ప్రత్యేక అలవెన్స్ చెల్లించే విదంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేయాలని డిమాండ్ చేశారు.
సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఏ రమేష్ బాబు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్ డి ఏ ప్రభుత్వం ప్రజల మౌలిక సమస్యలను పరిష్కారం చేయడం లేదన్నారు. పేదల సంపద అంత సంపన్నులకు దోచి పెడుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధాని, అంబానీలా కోసం ఉందా లేదా పేద ప్రజల కోసం ఉందా అని ప్రశ్నించారు. ధరలు పెంచి సామాన్య ప్రజలపై భారలు వేస్తున్నారని అన్నారు. నిత్యావసర సరకుల ధరల పెరుగుదలకు అనుగుణంగా పెన్షన్ కేంద్ర ప్రభుత్వం వాటా 5000 లకు పెంచాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ఉపాధి చూపడం లేదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేట్ పరం చేస్తూన్నారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాలయాపన చేస్తున్నారని తెలిపారు. పాలకులు ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.
ఎన్.టి.ఆర్.డి రాష్ట్ర ఉపాధ్యక్షులు యం బస్వారాజు మాట్లాడుతూ జాబ్ క్యాలెండర్ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ కోసం ప్రత్యేక జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ వికలాంగులకు స్వయం ఉపాధి కల్పన కోసం ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజపాలనలో ఆసరా పెన్షన్స్ కోసం దరఖాస్తు చేసిన 24.85 లక్షల మందికి వెంటనే పెన్షన్స్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 6000 పెన్షన్తో పాటు ఇతర హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పెన్షన్లలో వాటా ను 300నుండి 5000లకు పెంచాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగుల సంక్షేమo కోసం చర్యలు తీసుకోవాలని, లేని యెడల ఉద్యమలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ మహాసభల్లో ఏఐకేఎస్ జిల్లా అధ్యక్షులు గంగాధప్ప, పి ఎన్ ఎం జిల్లా కార్యదర్శి సిర్పాలింఘం, గ్రామ పంచాయతీ యూనియన్ కార్యదర్శి గంగాధర్, ఎన్ పి ఆర్ డి జిల్లా అధ్యక్షులు పి.కవిత, జిల్లా నాయకులు గైని రాములు, రామ్ పటేల్, నాజీర్, సాయమ్మ, నాగమణి, లక్ష్మణ్, గోపాల్, గోపాల్ గౌడ్, శ్రీనివాస్, ఎల్లయ్య, చింటూ, అస్మా బేగం, పెంట సాయిలు, గంగారాం లతో పాటు వివిధ మండలాల వికలాంగులు పాల్గొన్నారు.