అల్లుడు కుమార్ (39) అత్తారింట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డి జిల్లా రాజంపేట వాసి అయిన కుమార్, పాతూర్ కు చెందిన నిర్మలను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సొంత ఊరిలో ఉపాధి లేక రెండేళ్లుగా భార్యాపిల్లలతో కలిసి పాతూర్ లోనే ఉంటున్నాడు. కుటుంబ కలహాల కారణంగా మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మెదక్ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని పోలీసులు తెలిపారు.








