A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
— శ్రీ సరస్వతీ విద్యా మందిర్ పాఠశాలలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
ఆర్మూర్ పట్టణం లోని టీచర్స్ కాలని లో గల శ్రీ సరస్వతీ విద్యా మందిర్ పాఠశాలలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలను మంగళ వారం రోజున పాఠశాల ప్రాంగణం లో నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ప్రీ ప్రైమరీ పిల్లలు అందరూ శ్రీ కృష్ణుడు ,గోపిక వేషధారణ తో ఆకట్టు కోవడం జరిగినది.జిల్లా కార్య దర్శి రవినాథ్ ఆధ్వర్యం లో పూజ కార్యక్రమము అనంతరం ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ వినోద్ కుమార్ మాట్లాడుతూ శ్రీ కృష్ణుడు ఈ సృష్టిలోని సమస్త మానవాళికి మార్గదర్శకుడు అని ,కృష్ణుడు చూపెట్టిన మార్గం లో ప్రతి ఒక్కరం నడవాలని తెలియజేశారు. ఉట్టి కొట్టే కార్యక్రమం అనంతరం పిల్లలు సాంసృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో పాఠశాల జిల్లా కార్యదర్శి రవి నాథ్, మేనేజ్మెంట్ భాను తేజ, పాఠశాల ప్రిన్సిపల్ వినోద్ కుమార్, మాతాజీ లు శైలజ ముద్రకోల, సోనాలి, సింధుజ, మంజుల, శైలజ, లత, నిహారిక, వేద, ప్రియాంక, అంజలి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.