A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం రోజు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ ఏకకాలంలో తనిఖీలు నిర్వహించడం ఉలిక్కిపడ్డ వైద్య అధికారులు. ఆసుపత్రిలోని ప్రతి వార్డులో విరివిగా తిరుగుతూ ప్రతి ఒక్క పేషెంట్ ని వారి యొక్క భాగోగులను అడుగుతూ ఆసుపత్రిలో వైద్య సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయో పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు.
ఆసుపత్రిలో వైరల్ జ్వరాల మారిన పడ్డ ప్రజలు పెద్ద ఎత్తున ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి క్యూలు కడుతున్నారు. డెంగ్యూ టైఫాయి మలేరియా వంటి వ్యాధులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నరు.
ప్రభుత్వ ఆసుపత్రిలో సరిపడా మందుల కొరత ఏర్పడుతుందని ప్రజలకు తగిన వ్యాధులకు మందులు సరఫరాలేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. స్వయంగా ఎమ్మెల్యే కలెక్టర్ దృష్టికి తీసుకు వచ్చిన బాధిత ప్రజలు.