శ్రీ సరస్వతీ విద్యా మందిర్ లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు 💐💐.
సదాశివ్ A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం ::ఆగస్టు :26
శ్రీ సరస్వతి విద్యా మందిర్ ఉన్నత పాఠశాల భీంగల్ లో ఈరోజు కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించరు . హిందూ పంచాంగం ప్రకారం శ్రావణమాసంలో కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథి నాడు కృష్ణాష్టమిని జరుపుకుంటారు.
భగవతం ప్రకారం విష్ణుమూర్తి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కొరకు తన దశావతారాలలో 8వ అవతారంగా శ్రీకృష్ణుడిగా జన్మించాడు. శ్రీకృష్ణుడు తన చిలిపి చేష్టలతో జీవిత పరమార్ధాన్ని వివరించాడు. వెన్నదొంగగా మారి గోపికలతో పాటు అందరి మనసు దోచుకున్నాడు. గోపబాలకుడిగా, సోదరునిగా, అసుర సంహారిగా, ధర్మ సంరక్షకుడిగా ఇలా ఎన్నో పాత్రలను పోషించి జగద్గురువుగా పేరోందడని ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పాఠశాలలో జరిగిన కృష్ణాష్టమి వేడుకలలో విద్యార్థులు ప్రదర్శించిన శ్రీకృష్ణ లీలలు, నృత్యాలతో పాటు గోపిక వేషాధరణలో వచ్చిన విద్యార్థులు ఉట్టి లాగుతుంటే శ్రీకృష్ణ వేషాధరనలో వచ్చిన విద్యార్థులు ఉట్టిని పగులగొట్టే సన్నివేశాలు అందరిని ఆకట్టుకున్నాయి. అలాగే శ్రీకృష్ణ, గోపిక వేషధారణలలో వచ్చిన విద్యార్థులందరికీ పాఠశాల గౌరవ కమిటీ సభ్యులచే మెమొంటోలను అందచేశారు.
ఇట్టి కార్యక్రమంలో పాఠశాల గౌరవ అధ్యక్షులు కే. గంగారాం , పాఠశాల కార్యదర్శి జి. నర్సయ్య . విద్యావిషయక సలహాదారు యేన్ను. శ్రీధర్ , మంచె గణేష్ , ప్రధానాచార్యులు రాస రవికుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జి. నర్సారెడ్డి, పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, మరియు విద్యార్థులు పాల్గొన్నారు.