A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆర్మూర్ బస్ స్టాండ్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ప్రాంగణంలో గల హోటల్స్, ఇతర దుకాణ సముదాయాలను పరిశీలించి ఎక్కువ ధరలకు అమ్మినట్లు అయితే చర్యలు తప్పవని హోటల్స్ లో శుభ్రత అపరిశుభ్రత నాణ్యమైన ఆహారం అందించాలి అని అన్నారు, చరవాణి లో ఆర్టీసీ అర్ ఎం తో మాట్లాడుతూ ఆర్టీసి హద్దులు గుర్తించి చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని అలాగే మరుగుదొడ్లు, బత్రూమ్స్ శుభ్రంగా ఉండేలా చూడాలని కోరారు. మున్సిపల్ కమిషనర్ తో మాట్లాడుతూ చెత్త చెదారం ఎప్పటికప్పుడు తీయాలి అని కోరారు చైన్ స్నాచింగ్ వంటివి జరుగకుండా పోలీసులు నిరంతరం పర్యవేక్షణ చేయాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసి డీఎం, సూపర్ డెంట్ ఇతర అధికారులు పాల్గొన్నారు.