A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
పార్లమెంటు సభ్యునిగా అర్వింద్ ధర్మపురి భారీ మెజారిటీతో రెండవ సారి విజయం సాధించిన సందర్భంగా ఆర్మూర్ మండలంలోని అమ్దాపూర్ గ్రామంలో భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లా అధికార ప్రతినిధి బుస్సాపూర్ శంకర్ ఆధ్వర్యంలో శ్రీ శ్రీ శ్రీ అందాపూర్ మహరాజ్ అగ్గు స్వామి సమక్షంలో వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన పార్లమెంటు సభ్యులు అర్వింద్ ధర్మపురి కి హృదయ పూర్వక ధన్యవాదాలు అదే విధంగా. ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో కృషి చేసిన స్వామి వారి సేవకులకు ప్రత్యేక అభినందనలు.