ఇస్కాన్ నిజామాబాద్ ద్వారక నగర్ వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవం

సదాశివ్ A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం: ఆగస్టు 26 

భీమ్ గల్ పట్టణంలోని ఇస్కాన్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో సోమవారం రోజున జేబీఎస్ గార్డెన్ లో శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవం ఘనంగా జరిపారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయం నుండి భజన కార్యక్రమం కీర్తన, కార్యక్రమం, సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఇస్కాన్ సుందర్ రూప్ దాస్ ప్రభు ఆధ్వర్యంలో శ్రీకృష్ణ పల్లకి సేవను జేబీఎన్ గార్డెన్ నుండి సుదర్శన టాకీస్ వరకు పల్లకి సేవ ను ఊరేగింపుగా హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే అంటూ నినాదాలతో, భక్తుల భజన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గంగా విద్యానికేతన్ హై స్కూల్ పిల్లలతో నాట్య నృత్యాలు జరిపించారు. నామం- నిత్య శ్రీ కృష్ణ ప్రీర్థర్థం, శ్రీకృష్ణ యొక్క కుంభాభిషేకం సేవ జూలన్, సేవ శ్రీకృష్ణ లీలామృత శ్రావణం చివరగా మహా హారతి భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ భగవాన్ కి హారతి ఇవ్వడం జరిగింది. తదనంతరం   చప్పన్ బోగ్ భగవంతునికి సమర్పించరు. సుమారుగా 500 మందికి పైగా భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిం చారు. ఇస్కాన్ నామ హఠాప్రచార సుందర్ రూప్ దాస్, శివకుమార్, సనాతన, లక్ష్మీనారాయణ, దత్తాత్రి, జవ్వాజి శ్రీనివాస్, చంటి నరేష్, బాల మురళీకృష్ణ, పతాని ప్రవీణ్, పురస్తు లింబాద్రి, గోపు రాజు, పెద్ద ఎత్తున మహిళలు, భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *