A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
క్షత్రియ స్కూల్ టీచర్స్ కాలనీ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా రాధాకృష్ణుని వేషధారణలో చిన్నారులు అలరించారు. నృత్య ప్రదర్శనలు మరియు భగవద్గీత శ్లోకాలతో చిన్ని కృష్ణులు రాధమ్మలు అందర్నీ ఆకట్టుకున్నారు. ఇందులో భాగంగా స్కూల్ ప్రిన్సిపల్ నవిత మాట్లాడుతూ భగవద్గీత యొక్క సారాంశాన్ని నిత్యజీవితంలో పాటిస్తే అందరి జీవితం సుఖమయం అని మాట్లాడారు. ఇట్టి కార్యక్రమంలో భాగంగా క్షత్రియ విద్య సంస్థల కోశాధికారి అల్జాపూర్ గంగాధర్ మాట్లాడుతూ చిన్నారులను మరియు ఉపాధ్యాయ బృందాన్ని ఆశీర్వదించారు. స్కూల్ డైరెక్టర్ అల్జాపూర్ అక్షయ్ తన సతీమణితో మరియు పరీక్షిత్, ఈ కార్యక్రమంలో హాజరయ్యారు, ఇందులో చిన్నికృష్ణులు ఉట్టి కొట్టడానికి ఉత్సాహంగా పాల్గొన్నారు.