A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

*ఆర్మూర్ వారు నిర్వహిస్తున్న శ్రీ కృష్ణాష్ట జన్మాష్టమి మహోత్సవ ఆహ్వానం…

*శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవ ఆహ్వానం…

ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని ప్రెస్ భవన్ లో శనివారం రోజు ఇస్కాన్ ఆర్మూర్ వారి ఆధ్వర్యంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి మహోత్సవ వేడుకలకు పాత్రికేయుల సమావేశం నిర్వహించి ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఇస్కాన్ అధ్యక్షులు ఆదిపురుష గోవిందా దాస్ మాట్లాడుతూ, ఆదివారం రోజు పట్టణ కేంద్రంలోని అంగడి బజార్ వద్ద గల బాలాజీ ఫంక్షన్ హాల్ లో ఉదయం 9 గంటల నుండి శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవ వేడుకలు కొనసాగుతాయని అన్నారు. ఈ వేడుకలలో ఉదయం ఇస్కాన్ కేంద్రంలో మంగళహారతి, గురుపూజ, శ్రీమద్ భాగవత ప్రవచనం, అనంతరం గోపూజ, నగర సంకీర్తన, సాంస్కృతిక కార్యక్రమాలు, సంధ్య హారతి, శ్రీకృష్ణ ప్రీత్యర్థం పంచామృత అభిషేకం, పుష్పాభిషేకం, శ్రీకృష్ణ లీలామృత శ్రవణము, ప్రసాద వితరణ జరుగుతుందన్నారు. మధ్యాహ్నం మహా హారతి, అనంతరం మహా ప్రసాద అన్నవితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. సాయంత్రం ఐదు గంటల నుండి ఎనిమిది గంటల వరకు భజన, హరీనామ సంకీర్తన, భగవద్గీత ప్రవచనం, మహా హారతి, అన్న ప్రసాద వితరణ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గంగేశ్వర్ రాందాస్, గంగేశ్వర్ నియామ్ దాస్, భారత్ పడాల్, పడాల శ్రీకర్, దయాకర్, కౌశిక్, మణికంఠ, ధర్మేందర్, తదితరులు పాల్గొన్నారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *