A9 న్యూస్ ప్రతినిధి కామారెడ్డి:
కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలో శనివారం విద్యార్థులు బీబీపేట్ స్ట్రీట్ లైట్ వద్ద బస్సులను నిలిపి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ మాకు సరైన సమయంలో బస్సులు రాకపోవడం వల్ల మేము కళాశాలకు లేటుగా వెళ్లడం వల్ల క్లాసులు మిస్ అవుతున్నామని అందుకే ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించమని, ఎన్నిసార్లు డిపో మేనేజర్ కి చెప్పినా కూడా మమ్మల్ని పట్టించుకోవడంలేదని ఇలా అయితే మా చదువులకు ఆటంకాలు కలుగుతుందని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు నిర్వహించామన్నారు. ఉదయం 7 గంటల నుండి 7:30 మాకు బస్సు వచ్చే విధంగా ఆర్టీసీ డిపో మేనేజర్స్ స్పందించాలని వారు పేర్కొన్నారు కామారెడ్డి ఆర్టీసీ డిఎంకు ఎన్నిసార్లు వినతిపత్రం ఇచ్చిన చూసి చూడనట్టుగా వ్యవహరిస్తుందని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సులు సమయానికి రావడం లేదని విద్యార్థుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం మొత్తానికే బస్సుస్ లేవు కావున మాకు బస్సు కావాలి అని కోరుకుంటున్నాము ఇంటర్ విద్యార్థులకు చాలా ఇబ్బంది అవ్వుతుంది బస్సు లేక చాలా కష్టం అవుతుంది కావున మళ్ళీ యధావిధిగా మాకు ఉదయం శెట్టల్ గా ఇస్సనగర్ మరియు మల్కాపూర్ బస్సు కావాలి అని కోరుకుంటున్నారు.