31 లక్షల అనుమానాస్పద ఖాతాలు గుర్తించిన కేంద్రం – రాష్ర్టాలకు తక్షణమే తనిఖీల ఆదేశం.
దేశంలోని అర్హ రైతులకు కేంద్రం అందిస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ అమలులో భారీ పక్కదారి నిర్ధారణ అయింది. రాష్ట్రాల నుంచి అందిన వివరాల ప్రకారం, ఒక్కొక్క ఇంట్లో భార్య, భర్తలిద్దరికీ నిధులు జమ అవుతున్నాయి. మరికొంతమందికి మరణించిన వ్యక్తుల పేర్లతోనూ నిధులు జమైనట్లు బయటపడింది.
కేంద్ర వ్యవసాయ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, దేశవ్యాప్తంగా 31.01 లక్షల ఖాతాలు అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించారు. ఈ ఖాతాలన్నింటినీ అక్టోబర్ 15 నాటికి పరిశీలించాలంటూ రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.
ఇప్పటివరకు 19.02 లక్షల ఖాతాలను పరిశీలించగా, వాటిలో 17.87 లక్షలు (93.98%) అనర్హులుగా తేలాయి. ఇందులో భార్యాభర్తలిద్దరికీ నిధులు జమ కావడం, అలాగే గత యజమానుల పేరిట నిధులు మంజూరు కావడం వంటి అంశాలు కనిపించాయి.
రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం పూర్తి నివేదిక సిద్ధం చేసి రేపటిలోగా కేంద్రానికి సమర్పించనున్నాయి.








