A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
*ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ….
*ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా నేటి భారత్ బంద్ కు మద్దతుగా ఆర్మూర్ లో ప్రదర్శన…
ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని బాబాసాహెబ్ అంబేద్కర్ చౌరస్తాలో ఎస్సి, ఎస్టీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఎస్సి వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి, బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన, శాంతి ర్యాలీని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆల్ మాల స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్రకో- కన్వీనర్ అంగరి ప్రదీప్, మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు భారత రాజ్యాంగ వ్యతిరేక, మనువాదా మోదీ ప్రభుత్వ తీర్పు అని మండిపడ్డారు ఎస్సీ ఎస్టీలపై తీర్పులో పేర్కొన్న క్రిమిలేయర్ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని సుప్రీంకోర్టు తీర్పును పునః పరిశీలించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టుతీర్పు ముమ్మాటికీ బీజేపీ కుటిల రాజకీయాలకు నిదర్శనం అని రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో మనువాదా బీజేపీ ప్రభుత్వానికి మాలల సత్తాను చూపుతామన్నారు. అనంతరం ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు ముగా ప్రభాకర్, కౌన్సిలర్ కొంతం మురళీధర్ లు మాట్లాడుతూ, రిజర్వేషన్ల వర్గీకరణ క్రిమిలేయర్ అంటూ రిజర్వేషన్లు ఎత్తేసే కుట్రకు బీజేపీ తెర లేపుతుందని, బిజెపి ప్రభుత్వం దళితుల మధ్య చిచ్చు పెట్టడం మానుకోవాలన్నారు, బీఎస్పీ నాయకులు మార్ల ప్రభాకర్, నాగ్ సేన్ మాల, కొమిరె సుధాకర్ లు మాట్లాడుతూ, దళిత వ్యతిరేక చర్యలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాల్పడడం శోచనీయమన్నారు. రాబోయే రోజుల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కేంద్రంగా దళితులను ఏకతాటిపైకి తీసుకొచ్చి మనువాద ప్రభుత్వాల మెడలు వంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు కోమన్ పల్లి రాజన్న, సీనియర్ అంబేద్కర్ వాదులు శేట్పల్లి నారాయణ, టీచర్ పెద్ద భోజన్న, టీచర్ కోటేశ్వరరావు, మునారాబాద్ గంగాధర్, బత్తుల లింగం, మాజీ సర్పంచులు మిర్తాపల్లి మధువర్మ, గగ్గుపల్లి ప్రదీప్, రాంపూర్ దయానంద్, పింజ సుదర్శన్, పార్థేం సంజీవ్, గోలి పురుషోత్తం, సూరిబాబు, కొంతం పూర్ణచందర్, వివిధ గ్రామాల మాల యువజన సంఘం సభ్యులు, పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.