Monday, November 25, 2024

ఆర్మూర్ ఎమ్మెల్యే కార్యాలయంలో రుణమాఫీ ఫై పత్రిక సమావేశం

spot_img
- Advertisement -spot_imgspot_img
- Advertisement -spot_imgspot_img

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

కాంగ్రెస్ నాయకులు మార చంద్రమోహన్ నిన్న పెట్టిన పత్రిక సమావేశనికి కౌంటర్ గా నేడు బీజేపీ నాయకులు ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో పత్రిక సమావేశం నిర్వహించడం జరిగింది.

బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు నూతుల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… కాంగ్రెస్ నాయకులు మరచంద్ర మోహన్ బీజేపీ నాయకులను విమర్శించడం సరికాదు, తప్పుడు మాటలు మాట్లాడితే గ్రామ లలో రైతులు & బీజేపీ నాయకులు మిమ్మల్ని తిరుగనివ్వరిని, మీ హామీలు మోసపురితామణి, అంకాపూర్ లో ఎంత మంది రైతులు ఉంటే ఎందరికి మాఫీ అయ్యాయి ముందు తెలుసుకొని మాట్లాడాలని, మోడీ ప్రభుత్వం రైతులకు ఎంతో మేలు చేస్తుందని రైతుకు ఒక ఎకరానికి 16 వేల నుండి 18 వేల వరకు యూరియా మరియు డి ఎ పి ద్వారా సబ్సిడీ ఇస్తుంది అని, రైతులకు ఇచ్చిన మాట ప్రకారం పసుపు బోర్డు ను ఏం పి.ధర్మపురి అరవింద్ తెచ్చారని తెలిపారు, ఆగష్టు 24న రైతు సమావేశానికి బీజేపీ పూర్తి మద్దత్తు ఇస్తుందని తెలిపారు. బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగొట గంగాధర్ మాట్లాడుతూ….. కాంగ్రెస్ నాయకులు మరచంద్ర మోహన్ బీజేపీ ని విమర్శించే నైతిక హక్కు లేదని, అసెంబ్లీ ఎన్నికల్లో మాట ఇచ్చిన ప్రకారం, ముఖ్య మంత్రిగా ఎన్నికైనా తరువాత దేవ్వుల్లా పైనా ఒట్టు పెట్టి మాట తప్పారని, రైతు ఐక్య కార్యచరణ కమిటీ సమావేశానికి బీజేపీ ఎం ఎల్ ఏ పైడి రాకేష్ రెడ్డి మరియు బీజేపీ మద్దత్తు ఇవ్వడం వాళ్ల కాంగ్రెస్ గుండెల్లో రైళ్లు పరుగేడుతున్నాయని, వాస్తవాలు మాట్లాడితే కాంగ్రెస్ నాయకులకు మింగుడు పడదు అని, గత ప్రభుత్వం లక్ష రుణ మాఫీ చేస్తేనే 17వేల కోట్లు ఖర్చు అయ్యాయని, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల లెక్క ప్రకారం 47 లక్షల మంది రైతులకు 49500 కోట్లు అవసరం అని తెలుపుతే మీరు తుతూ మంత్రాంగ రుణ మాఫీ చెయ్యడం ఎంతవరకు కరెక్ట్ అని అన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం పేదల నడ్డి విరిచే ప్రభుత్వం ఇప్పటి వరకు గృహజ్యోతి సరిగ్గా అమలు కావడం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ నిరుద్యోగాన్ని భర్తీ చేసుకోవడం కొరకు బీసీ కులాల ఛైర్మెన్ లను నియమించి, బడ్జెట్ లో సున్నా నిధులు కేటాయించారాని, రైతు రుణ మాఫీ విషయం లో పెద్ద పెద్ద ప్రకటనలు వేస్తూ అర్బటానికి ఎక్కువగా, అమలుకు తక్కువగా ఉంది అని, నిజామాబాదు జిల్లా రైతులు చాలా చైతన్యం గలవారని, తప్పుడు వాగ్దానలు ఇచ్చి అధికారం లోకి వచ్చిన తరువాత అమలు చేయకుంటే ఎలా మేడలు వంచలో బాగా తెలుసు అని, ఆగష్టు 24 రైతుల సమావేశానికి బీజేపీ సంపూర్ణ మద్దతు ఉంటుందని, కాంగ్రెస్ తో మాకు చర్చ అనవసరమని, మీరు రైతులకు సమాధానం చెప్పండి అని తెలిపారు. బీజేపీ ఎన్నికల ముందు ఏమి చేపిందో అదే మోడీజీ నాయకత్వం లో అమలు అవుతాయాని తెలిపారు బీజేపీ పట్టణ అధ్యక్షులు ద్యాగ ఉదయ్ మాట్లాడుతు కాంగ్రెస్ నాయకులు బీజేపీ ని అనవసరంగా విమర్శిస్తే ఊరుకునేది లేదని, రైతు రుణ మాఫీ విషయం లో ఇచ్చిన హామీని నెరవేర్చండి అంటే తప్పు ఎలా అవుతుందని, రైతులకు బీజేపీ సంపూర్ణ మద్దతుఉంటుందని. మీది ప్రజా ప్రభుత్వం అంటే ఇచ్చిన హామీలు నెరవేర్చండి, ఎన్నికల ముందు ఒకమాట ఎన్నికల తరువాత మాట తప్పడం కాంగ్రెస్ కు అలవాటు అని అన్నారు. ఈ సమావేశం లో బీజేపీ జిల్లా అధికార ప్రతినిది జెస్సు అనిల్, బీజేపీ ప్రధాన కార్యదర్శి పోల్కం వేణు, నాయకులు జక్కం పోశెట్టి, రంగన్న, పాన్ శ్రీనివాస్, అరె రాజేశ్వర్, గుమ్ముల ఒడెన్న, లింగం, తోట నారాయణ పాల్గొన్నారు.

+ posts
- Advertisement -spot_imgspot_img
Latest news
spot_img
- Advertisement -spot_img
Related news
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here