ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా “భీంగల్ బంద్- భారత్ బంద్”.
ఆగస్టు 21:
సదాశివ్ A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం
“భీంగల్” లో ప్రశాంతంగా “భారత్ బంద్”.
భీంగల్ మండల కేంద్రంలోని బాబాసాహెబ్ అంబేద్కర్ చౌరస్తాలో ఎస్సి,ఎస్టీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఎస్సి వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి, శాంతి ర్యాలీని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు భారత రాజ్యాంగ వ్యతిరేక, మనువాదా మోదీ ప్రభుత్వ తీర్పు అని మండిపడ్డారు ఎస్సీ ఎస్టీలపై తీర్పులో పేర్కొన్న క్రిమిలేయర్ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని సుప్రీంకోర్టు తీర్పును పునః పరిశీలించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టుతీర్పు ముమ్మాటికీ బీజేపీ కుటిల రాజకీయాలకు నిదర్శనం అని రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో మనువాదా బీజేపీ ప్రభుత్వానికి మాలల సత్తాను చూపుతామన్నారు. రిజర్వేషన్ల వర్గీకరణ క్రిమిలేయర్ అంటూ రిజర్వేషన్లు ఎత్తేసే కుట్రకు బీజేపీ తెర లేపుతుందని, బిజెపి ప్రభుత్వం దళితుల మధ్య చిచ్చు పెట్టడం మానుకోవాలన్నారు, దళిత వ్యతిరేక చర్యలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాల్పడడం శోచనీయమన్నారు. రాబోయే రోజుల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కేంద్రంగా దళితులను ఏకతాటిపైకి తీసుకొచ్చి మనువాద ప్రభుత్వాల మెడలు వంచుతామన్నారు. బంద్ సందర్భంగా కిరాణావర్తక.వాణిజ్య. వస్త్ర. వ్యాపార. స్కూల్స్ & కాలేజీలు. హోటల్స్ ఇంజనీరింగ్ & ఎలక్ట్రికల్ షాప్స్. ట్రేడర్స్. బేకరీ. చికెన్ సెంటర్స్. సిమెంట్ షాప్స్. జిరాక్స్ చిరు వ్యాపారులు అందరూ స్వచ్ఛందంగా బందుకు సంపూర్ణ మద్దతును అందించడం జరిగింది .ఈ కార్యక్రమంలో వర్గీకరణ పోరాట సమితి నాయకులు బట్టు.అనిల్, దైడి.సురేష్, మేకల శ్రీనివాస్, బీమా రవీందర్, కునే. రమేష్, ఆనంద్, నవీన్, విజ్ఞేష్, బట్టు. సునీల్, దైడి. మురళి, వివిధ గ్రామాల మాల యువజన సంఘం సభ్యులు, పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.