భీమ్ గల్ సరస్వతీ విద్యా మందిర్ పాఠశాల లో రక్షాబంధన్ వేడుకలు
ఆగస్టు 17: సదాశివ్ A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం
నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ పట్టణం లో గల శ్రీ సరస్వతి విద్యా మందిర్ ఉన్నత పాఠశాల లో ఈరోజు రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించరు.పాఠశాలలో చదువుతున్న బాలికలు బాలురకు నేను నీకు రక్ష-నువ్వు నాకు రక్ష-మనమందరం దేశానికి, ధర్మానికి రక్ష అంటూ రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాలలో పనిచేస్తున్న తెలుగు ఉపాధ్యాయుడు వై. చంద్రశేఖర్ రాఖీ పండుగ యొక్క విశిష్టతను విద్యార్థులకు తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో ప్రధానాచార్యులు రాస రవికుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జి. నర్సారెడ్డి, పీఈటీలు ఎస్ నరేష్, ఐ. గంగాధర్, ఉపాధ్యాయులు జే చంద్రశేఖర్, డి శ్రీనివాస్, వై వినోద్ కుమార్, ఎం మాధవి, పి శ్రీ వాణి, బి స్వర్ణ, ఎం దివ్య, పి శిరీష, కే. రజిత, ఎం రమ్య, కే రేణుక, ఈ సంధ్య, ఎం నవనీత,డి. స్రవంతి.డి.శుబజ పాల్గొన్నారు. ఆ తర్వాత పాఠశాలకు చెందిన బాలికలు ఉపాధ్యాయులైన ఆర్ రవికుమార్, పి. సాయి చరణ్, సిహెచ్ కార్తీక్, పి. రాజేందర్ ఆధ్వర్యంలో పట్టణంలోని వ్యాపార సంస్థలోకి వెళ్లి పాఠశాల తరఫున రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించినారు.