A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
తెలంగాణ ప్రభుత్వం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని అధికారకంగా నిర్ణయించడం హర్షించదగ్గ విషయమని, గ్రామ గ్రామాన జయంతిని నిర్వహించాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మోత్కూరి లింగా గౌడ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గౌడ కులస్తులందరూ పార్టీలకతీతంగా ఒకే వేదిక మీదికి రావాలన్నారు. గౌడ హక్కుల సాధన కోసం పోరాడాలని, రాజకీయంగా గౌడులందరూ చైతన్యం కావాలని తెలిపారు. జయంతిని అధికారికంగా ప్రకటించడంతో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కు, మంత్రి పొన్నం ప్రభాకర్ కు రుణపడి ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు జనార్దన్ గౌడ్, శంకర్ గౌడ్, నర్సాగౌడ్, రాజేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.