A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్ ఆగస్టు 07:
ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ సమావేశాలలో గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం గళమెత్తిన మొత్తం ప్రభుత్వం దృష్టి ని ఆకర్షించి, గల్ఫ్ కార్మికుల కష్టాలను వివరించిన మొట్టమొదటి శాసన సభ్యుడు కావడం వలన ఈ రోజు నిజామాబాద్, జగిత్యాల జిల్లాలలో గల్ఫ్ కార్మికులకు సేవ చేస్తున్న వివిధ గల్ఫ్ కార్మిక సంఘాల నాయకులు అంకాపూర్ లో ఆర్మూర్ ఎమ్మెల్యే ను కలిసి తమ కృతజ్ఞతను తెలుపుకున్నారు. ఈరోజు ఏం మార్ డబ్ల్యు ఎఫ్ అధ్యక్షుడు కోటపాటి నరసింహం నాయుడు ఆధ్వర్యంలో భీంగల్ మండలం నుండి కుంట దశాగౌడ్, జక్రాన్ పల్లి మండలం నుండి బట్టు స్వామి, (కువైట్) కె. రాజ్ కుమార్, ప్రవాసి మిత్ర – మెట్ పల్లి, కొక్కుల విద్యాసాగర్ ( సౌదీ రిటర్న్) కోయల్ కర్ నరేష్, ఆర్మూర్ మండలం (ఎం ఆర్ డబ్ల్యు), కొట్టాల అశోక్, బడా భీంగల్, ధీ కొండ కిరణ్ ప్రవాసి మిత్ర, పులి రమేష్ (ఎం ఆర్ డబ్ల్యూ ఎఫ్) తదితరులు పెద్ద సంఖ్యలో రాకేష్ రెడ్డిని కలిసి శాలువాలతో పూలదండలతో సత్కరించి పైడి రాకేష్ రెడ్డి నాయకత్వంలో ” గల్ఫ్ కార్మిక సంక్షేమ బోర్డు ” ఎన్ఆర్ఐ ల భవన నిర్మాణం, గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం 1000 కోట్లు సాధన కోసం తమంత పార్టీల కతీతంగా కలిసి నడుస్తామని హామీ ఇచ్చారు. పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ తాను స్వయంగా గల్ఫ్ కార్మికుడి స్థాయి నుండి అసెంబ్లీకి ఎదిగిన వ్యక్తిగా గల్ఫ్ కార్మికుల కష్టాలు తీరే వరకు మీ వెంటే ఉండి ప్రభుత్వాల మెడలు వంచి నిధులు సాధిస్తానని హామీ ఇచ్చారు.