A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
కల్యాణలక్ష్మి షాదిముబారక్ పథకాలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తూ, పెళ్లి చేసుకునే పేదింటి ఆడబిడ్డలకు మేనమామ కట్నంగా రూ|| లక్ష నూట పదహారు రూపాయలను మంజూరు చేస్తున్నారు, ఆర్మూర్ ప్రాంతములో పెళ్లిచేసుకునే పేదింటి ఆడబిడ్డలకు మేనమామ కట్నంగా కల్యాణలక్ష్మి షాదిముబారక్ పథకం ద్వారా పెద్దఎత్తున అత్యధికoగా మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రికి ఆర్మూర్ ప్రాంత ప్రజలు నిండు మనసుతో కృతఙ్ఞతలు తెలుపుతున్నారు. ఆర్మూర్ పట్టణం రెండవ వార్డు లోని జిరాయత్ నగర్ లో నివసించే బారాడ్ స్వరూప, సంతోష్ నగర్ లో నివసించే వాగ్మారే శోభలకు కల్యాణ లక్ష్మి ద్వారా, జిరాయత్ నగర్ కు చెందిన రహమ బేగం కు షాదీ ముబారక్ ద్వారా ముఖ్యమంత్రి మంజూరు చేసిన రు,, 1,00,116/- చొ,, చెక్కులను ఇటీవల తీసుకున్నారు. మున్సిపల్ కౌన్సిలర్ మరియు ప్రముఖ మహిళా న్యాయవాది, బార్ అసోసియేషన్ మాజీ ఉపాద్యక్షులు, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ మెంబర్ సంగీత ఖాందేష్ గురువారం లబ్దిదారుల ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమములో పట్టణ కాంగ్రెస్ నాయకులు ఖాందేష్ సత్యం, దత్తాద్రి, ఉమేష్, రూపేష్, నరేష్, శరత్, సమీర్, మజీద్, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.