Tuesday, November 26, 2024

రైతులకు విత్తనాభివృద్ధి సంస్థ ద్వారానే విత్తనాలు అందించాలి – ఏఐకేఎంఎస్ డిమాండ్

spot_img
- Advertisement -spot_imgspot_img
- Advertisement -spot_imgspot_img

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

*తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి కి వినతి పత్రం

ఆర్మూర్ పట్టణ కేంద్రంలో అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏ.ఐ.కే.ఎం.ఎస్) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య మాట్లాడుతూ ఆర్మూర్ ప్రాంతంలో అత్యధికంగా రైతులు ఎర్రజొన్న పంటను పండిస్తున్నారు. ఈ పంటను పండించడంలో ఈ ప్రాంత రైతులకు మంచి అనుభవము ఉంది. ఈ పంట చేతికొచ్చినప్పుడల్లా పంటను అమ్ముకునే సందర్భంలో ప్రైవేట్ సంస్థల వారు అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రైతులు వ్యాపారుల మోసాలకు గురై లక్షల రూపాయలు నష్టపోతున్నారు. ప్రైవేట్ సంస్థల యజమానులు రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించక పంట చేతికి రాక రైతులు కోట్ల రూపాయలు నష్టపోతున్నారు అని వారు అన్నారు. గతంలో రైతుల ఆందోళనలు వారికి గుర్తుచేస్తూ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ వై.యస్ రాజశేఖర్ రెడ్డి ఆయంలో రైతుల ఆత్మహత్యల నివారణ గాను వేసిన “జయంతి ఘోష్ కమిషన్” కూడా ప్రభుత్వమే నాణ్యమైన విత్తనాలు తయారు చేసి రైతులకు సప్లై చేయాలని చెప్పిన సూచనలు మన కళ్ళ ముందు ఉన్నాయి అని వారు గుర్తు్చేశారు. కాబట్టి తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారానే రైతులకు సరిపడే నాణ్యమైన విత్తనాలు అందించాలని, అఖిలభారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) డిమాండ్ చేస్తుంది అన్ని వారు తెలియాచేశారు. అలాగే తిరిగి పంట చేతికి వచ్చిన సందర్భంలో మన సంస్థ ద్వారానే కొనుగోలు చేసి విక్రయించాలి మరియు పశుసంవర్ధక శాఖ వారికి కూడా వీటిని అందించినట్లయితే తెలంగాణ పాడి రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది అని అన్నారు. కాబట్టి విత్తన సంస్థల మోసాలను వారి నుండి రైతులు నష్టపోకుండా కాపాడాలని మరియు తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలని వారిని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల పాపన్న, నాయకులు సూర్య శివాజీ, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దేశెట్టి సాయి రెడ్డి, జిల్లా నాయకులు, రాపాని గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.

+ posts
- Advertisement -spot_imgspot_img
Latest news
spot_img
- Advertisement -spot_img
Related news
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here