A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని కెసిఆర్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ స్థలాలను అధికారపార్టీ నాయకులు యాతేచ్చగా కబ్జాలు చేస్తుంటే అధికారులు వారికీ ప్రభుత్వ ఆస్తులపై ఇష్టమొచ్చినట్లు నకిలీ పత్రాలు సృష్టించడమే వాటికీ ఇంటినెంబర్లు కేటాయించడం ఏమిటని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నాయకులు మంగళవారం ఆర్మూర్ మున్సిపల్ గేటు ఎదుట ధర్నా నిర్వహించి మున్సిపల్ అధికారి శేఖర్ కు పిర్యాదు చేశారు. ఈ సందర్బంగా సిపిఐ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి ఆరెపల్లి సాయిలు మాట్లాడుతు. ఒకపక్క పేదవాళ్లకు డబుల్ ఆశలు చూపి 10%శతము మరియు అసయిన్డ్ మెంట్ భూములను యాదేచ్చగా కబ్జాలు చేస్తుంటే వాటిని రక్షించాల్సిన ప్రభుత్వ అధికారులు కొందరు కబ్జా దారులకు అండగా నిలబడి కాళీ స్టలాలకు ఇంటినెంబర్లు కేటాయించి అధికార దుర్వినియోగంకు పాల్పడితే ఇప్పటికి ఆ అధికారులపై మున్సిపల్ కమిషనర్ గాని పై అది కారులే గాని ఇప్పటికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఏమిటని తప్పు చేసింది ఎంతవరైనా చర్యలు తీసుకోవాలని లేకపోతే ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయానికి సిపిఐ ఆధ్వర్యంలో ముట్టడిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సయ్య, నవాబ్, శ్రీకాంత్, పేరోజ్, నరేష్.,శ్రీను, మంగ, రమేష్, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.