A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆర్మూర్ పట్టణంలో దసరా ఉత్సవాలు ఆనందోత్సాహాల మధ్య ముగిశాయి. శోభాయమానంగా అలంకరించిన దుర్గాదేవి విగ్రహాలను భక్తులు నినాదాలు, డప్పు ధ్వనులు, డీజే సాంగ్స్, నృత్యాలతో ఊరేగింపుగా తీసుకువెళ్లారు. పట్టణం వీధులన్నీ రంగురంగుల కాంతులతో, పండుగ వాతావరణంతో కళకళలాడాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు వేలాది మంది భక్తులు ఈ మహోత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
పోలీసులు, మున్సిపల్ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో నిమజ్జన కార్యక్రమం ఎటువంటి ఇబ్బందులు లేకుండా శాంతియుతంగా పూర్తయింది.








