A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
రక్ష స్వచ్చంద సేవా సంస్థ, ఆర్మూర్ వారి ఆధ్వర్యములో ఆర్మూర్ పట్టణములోని జిరాయత్ నగరులో గల విద్యా హై స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన “అవ్వకు బువ్వ” కార్యక్రమములో ప్రతి నెలలో భాగంగా పేదలకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా దాదాపు 52 మంది పేదవృద్దులకు ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస్ ఖాందేష్, ప్రధాన కార్యదర్శి విద్యా ప్రవీణ్ పవార్, ఉపాధ్యక్షులు జిందామ్ నరహరి లు మాట్లాడుతూ అవ్వకు బువ్వ కార్యక్రమం ద్వారా పేద వృద్దులకు తమవంతు సహకారం అందిస్తున్నామని, మానవ సేవయే మాధవ సేవ” అనే నినాదం యొక్క తాత్పర్యాన్ని గ్రహించి గత 10 సం,, ల క్రితం పీజీ చదివిన విద్యావంతులం అందరం దాదాపు 18 సభ్యులం కలిసి రక్షా స్వచ్చంధ సేవా సంస్థ ను ప్రారంభించి నిరంతరం సేవా కార్యక్రమాలు చేస్తున్నాము అని అన్నారు. త్వరలో సంస్థ తరపున మరిన్ని సేవా కార్యక్రమములు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రధాన కార్యదర్శి విద్యా ప్రవీణ్ పవార్, ఉపాధ్యక్షులు జిందమ్ నరహరి, ఎస్ జి. శ్రీకాంత్ కోశాధికారి గొనె శ్రీధర్, కార్యనిర్వహక కార్యదర్శులు డా.బేతు గంగాధర్, ఖాందేష్ సత్యం, తులసి పట్వారి, సంయుక్త కార్యదర్శి మీరా శ్రావణ్ సభ్యులు గోక శరత్, విష్ణు, చైతన్య, బండారి నరేశ్, రాజేష్, సాయి, తదితరులు పాల్గొన్నారు.