A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం స్వచ్ఛదనంగా – పచ్చదనంగా ఉండాలని ఎంతో ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమమును చేపట్టారు అందులో భాగంగా ఆర్మూర్ లో స్వచ్ఛధనం – పచ్చదనం కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. సోమవారం ఆర్మూర్ పట్టణములోని రెండవ వార్డు పరిధిలోని వడ్డెర కాలనీ, సంతోష్ నగర్ లలో కౌన్సిలర్ సంగీత ఖాందేష్ ఆధ్వర్యములో స్వచ్చదనం – పచ్చదనం అందరూ పాటించాలని నినాదాలు చేస్తూ కాలనీలలో ర్యాలీ కార్యక్రమము చేపట్టారు. ఈ సందర్బంగా మున్సిపల్ రెండవ వార్డు కౌన్సిలర్ మరియు బార్ అసోసియేషన్ మాజీ ఉపాధ్యక్షురాలు, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ మెంబర్ సంగీతా ఖాందేష్ మాట్లాడుతూ ఆర్మూర్ ప్రాంతమంతా స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమాన్ని చేపట్టి అందులో భాగంగా వన మహోత్సవము అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, మన ఇంటి సమీపములో నాటిన మొక్కలను నీళ్లు పోసి కాపాడాలని కోరారు. అదే విదంగా పరిసరాలను పరిశుబ్రముగా ఉంచుకొని ఆరోగ్యాలను కాపాడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమములో పట్టణ కాంగ్రెస్ నాయకులు ఖాందేష్ సత్యం మున్సిపల్ అధికారులు షకీల్, వార్డు ప్రత్యేక అధికారి చక్రధర్, మున్సిపల్ సిబ్బంది సురేష్, గోపి, పోశన్న స్థానిక నాయకులు వెంకటి, నరేశ్, రాజారామ్, ఆర్ పి మమత సమాఖ్య సభ్యులు మరియు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.