A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టినటువంటి 75 వన మహోత్సవం లో భాగంగా ఆలూర్ మండల కేంద్రంలో స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ప్రభుత్వం ఆదేశాల ప్రకారం స్థానిక ప్రజాప్రతినిధులతో ర్యాలీ నిర్వహించి, ప్రాథమిక పాఠశాలలో పరిసరాలు శుభ్రం చేసి, పాఠశాల విద్యార్థులకు ఎంఈఓ రాజలింగం ఆధ్వర్యంలో వ్యక్తి పరిశుభ్రత గురించి, ప్లాస్టిక్ వాడడం పై దుష్ఫలితాల గురించి, వ్యాసరస పోటీలు నిర్వహించారు. ఆ విధంగానే పరిశుద్ధ కార్మికులచే పరిసరాల పరిశుభ్రత, పిచ్చి మొక్కల తొలగింపు, తడి పొడి చెత్తలపై ప్రజలకు అవగాహన కలిపించారు. ఈ కార్యక్రమం లో ఆలూర్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముక్కెర విజయ్, మాజీ ఉప సర్పంచ్ దుమాజి శ్రీనివాస్, తహసిల్దార్ నరేష్, సెక్రటరీ రాజలింగం, కార్యదర్శి సంతోష్, కాంగ్రెస్ నాయకులు ఉదయ్, భాస్కర్, నవనీత్, సంజీవ్, ములకడి శ్రీనివాస్, ఆశ వర్కర్లు, అంగన్వాడి టీచర్స్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *