A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని 23 వ మరియు 10వ వార్డులలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన
“స్వచ్చదనం- పచ్చదనం” భాగంగా ఇంటి ఇంటికి తిరుగుతూ మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ వన్నెల్ దేవి లావణ్య, అయ్యప్ప శ్రీనివాస్ మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు పండిత్ పవన్, మామిడిపల్లి మాజీ సర్పంచ్ గడ్డం మారుతి రెడ్డి, ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్, కౌన్సిలర్లు కొంతం మంజుల మురళి, శాల ప్రసాద్, ఆకుల రాము, ఇట్టేది నర్సారెడ్డి, డిసిసిబి డైరెక్టర్ వాసు, కాంగ్రెస్ నాయకులు శ్యామ్ గౌడ్, అజ్జు భాయ్, శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.