…
సదాశివ్ A9 న్యూస్ బాల్కొండ నియోజకవర్గం :జులై 25
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం
చిట్టాపూర్, శ్రీరాంపూర్ గ్రామాలలోగురువారం రోజున బాల్కొండ మండల ఏ.పీ.వో. గంగ మోహన్, చిట్టాపూర్, శ్రీరాంపూర్, బాల్కొండ, గ్రామాల కార్యదర్శులు రజనీకాంత్, గణేష్, సాయి కృష్ణలు ఆ గ్రామాలను సందర్శించి పారిశుద్ధం సమస్యలను పరిశీలించారు. అంతేకాకుండా ఆయా గ్రామాలలో పారిశుద్ధ కార్మికులతో, ఉపాధి హామీ కూలీలతో, గ్రామంలోని నీటి నిలువ గుంతలలో మొరం,మట్టి, పోయించి చదును చేయించారు. గ్రామంలోని ప్రధానా వీధుల గుండా నీటి నిల్వ లేకుండా పారిశుద్ధ పనులను శుభ్రం చేయించారు. అలాగే ప్రతి వీధిలో పారిశుద్ధం పనులు చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో, అంగన్వాడి కేంద్రాల్లో, పలు ప్రభుత్వ కార్యాలయాల వద్ద, గ్రామాలలో,చెత్త చెదారం తొలగింపు, పిచ్చి మొక్కలు, ముళ్ళ పొదలను తొలగింప చేశారు. మురుగు కాల్వాలలో, సి.సి. డ్రైనేజీలలో చెత్త చెదారాన్ని తొలగింపజేసి, చెత్తని దూర ప్రాంతంలో గల డంపింగ్ యార్డులో పారవేశారు. మురుగు కాల్వలలో, సీ.సీ డ్రైనేజీలలో బ్లీచింగ్ పౌడర్ చల్లించి, పాకింగ్ మిషన్ ద్వారా స్ప్రే చేయించారు. ఇంటింటికి తిరుగుతూ, ఇంటి చుట్టూ చెత్తాచెదారాన్ని బుట్టలలో వేసుకోవాలని, జిపి ట్రాక్టర్ వచ్చినప్పుడు ట్రాక్టర్లలో వెయ్యాలని అధికారులు సూచించారు. అంతే కాకుండా నీటి కుండీలలో నీరు నిలువ ఉండకుండ చూసుకోవాలని ఇంటింటికి తిరుగుతూ అవగాహన కల్పించారు. ఇంటి చుట్టూ పరిసరాలను పరిశీలభంగా ఉంచుకోవాలని ఇంటి కుటుంబ సభ్యులకు ఆయా గ్రామాల కార్యదర్శులు గ్రామస్తులకు, కుటుంబ సభ్యులకు వివరించారు.