A9 న్యూస్ ప్రతినిధి కామారెడ్డి జులై 3:
కామారెడ్డి జిల్లా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని రేపు బీడీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త తలపెట్టిన బంద్ ను విజయవంతం చేయాలని బిడిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు నరేందర్ అన్నారు. ఈ సందర్భంగా బీడీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని, అలాగే ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాలలో మూసి వేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అట్లాగే ప్రభుత్వ ప్రవేట్ కార్పొరేట్ పాఠశాలకు రేట్ కార్పొరేషన్ విచ్చలవిడిగా పర్మిషన్ లిస్ట్ సామాన్య ప్రజలకు చదువుకు దూరం చేస్తూ ప్రభుత్వం చేస్తుందని, అలాగే ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో పైన లేని ప్రేమ వాళ్ళ ఇచ్చే కమిషన్లకు కకృతి పడి ఎటువంటి సౌకర్యాలు లేకున్నా ప్రైవేట్ పాఠశాలలకు పర్మిషన్ ఇస్తున్నారని అన్నారు. అలాగే ఇప్పటివరకు పిల్లలకు స్కాలర్షిప్ ఇంతవరకు రాలేదు అలాగే ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు లేక కల్పించకుండా ఈ విద్యాసంస్థను ప్రారంభమైనది అన్ని సమస్యల పైన 4వ తేదీన అన్ని ప్రభుత్వ మరియు ప్రవేట్ పాఠశాలలు, కళాశాలలో సంపూర్ణంగా మద్దతు తెలపాలని బీడీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు నరేందర్, ఉపాధ్యక్షులు ప్రవీణ్ భాస్కర్, జిల్లా కార్యదర్శి సుదర్శన్, జిల్లా నాయకులు గైని శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.