A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్ జూలై 3:
రేపు జరిగే భారత్ బంద్ ను జయప్రదం చేయాలని ఎన్ ఎస్ యు ఐ, ఎస్ ఎఫ్ ఐ, ఏఐఎస్ఎఫ్, పి డి ఎస్ యు, ఏఐపీఎస్యు, ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణ కేంద్రంలో ఐఎఫ్టియు కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా పీ.డి.ఎస్.యు ఆర్మూర్ డివిజన్ అధ్యక్షులు ప్రిన్స్ మాట్లాడుతూ దేశంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఎన్ ఈ టి ఎగ్జామ్ పేపర్ లీకై ఫలితాల్లో స్కామ్ జరిగిందని. జూన్ 14న ఎగ్జామ్ రిజల్ట్స్ ఉండగా ముందుగానే జూన్ 4న రిజల్ట్స్ ఇచ్చారు మరియు దేశ చరిత్రలోనే మొదటిసారి 67 మందికి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రావడం, అందులో ఒకే పరీక్ష కేంద్రంలో 8 మంది విద్యార్థులకు 720 కి 720 మార్కులు రావడం, యూజీసీ నెట్ ఎగ్జామ్ రద్దు కావడం మరియు నీట్ పీజీ పరీక్ష వాయిదా పదడం ఇలా అనేక అనుమానాలకు వ్యక్తం అవుతుందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ చాయ్ అమ్మిండో లేదో తెలియదు కానీ చాయ్ అమ్మినట్లు మాత్రం పేపర్లను అమ్ముతున్నాడు అని వారు మండిపడ్డారు అన్నారు. దేశంలో దాదాపు 24లక్షల మంది, తెలంగాణ రాష్ట్రంలో 60 వేలకు పైగా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడిన ఎన్ టి ఏ పై ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటివరకు సరిగ్గా స్పందించకపోవడం దుర్మార్గం మరియు తెలంగాణ బీజేపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు దీని పై మాట్లాడకపోవడం సిగ్గుచేటు అని అన్నారు. కేంద్ర మంత్రులు వెంటనే ఎన్ టి ఏ ను ప్రక్షాళన చేయాలి మరియు నీట్ మరియు పీజీ పరీక్షను రద్దు చేసి మరలా నిర్వహించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఇలాంటి అవినీతిలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని లేనిపక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తారని హెచ్చరించారు. ఈ సందర్భంగానే రేపు భారత్ బంద్ కు పిలుపునివ్వడం జరిగింది అని ఆయన అన్నారు. మరియు దేశవ్యాప్త విద్యాసంస్థల బంద్ కు ప్రైవేట్ యాజమాన్యాలు విద్యార్థులు స్వచ్ఛందంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ఆర్మూర్ డివిజన్ ఉపాధక్షులు శ్రవణ్, ఏఐఎస్ఎఫ్ ఆర్మూర్ మండల్ ఆధ్యక్షులు చోటు, పీ.డి.ఎస్.యు జిల్లా ఆధ్యక్షులు ఎం.నరేందర్, వరప్రసాద్, అనిల్, నిఖిల్, సిద్దు, సాయి తదితరులు పాల్గొన్నారు.