A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్:
నిజామాబాద్ లో ఐఎఫ్టియు ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన–సభ కార్మికులందరికీ కాంగ్రెస్ మేనిఫెస్టో లో ప్రకటించిన దాని ప్రకారం 4000 వేల రూపాయల జీవన భృతి వెంటనే అమలు చేయాలని ఐ.కృష్ణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. సూర్య శివాజీ అధ్యక్షతన నిజామాబాద్ నగరంలో సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న కృష్ణ మాట్లాడుతూ,
బీడీ పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదనీ, కార్మికులకు ఉపాధి కల్పించండి లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీవనభృతి యిచ్చి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.గత సర్కార్ కెసిఆర్ మనకు అనేక ఆంక్షలు విధించి, కార్మికులకు తీవ్ర ఇబ్బంది కలిగించిందని ఆయన తెలిపారు.భీడీ పరిశ్రమను దెబ్బతీయానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం రకరకాల చర్యలను
చేపట్టి, సిగిరేటు కంపెనీలకు ఊడిగం చేస్తుందని ఆయన అన్నారు. మోడీ ఎన్నికల్లో ఉపాధి భద్రత, స్వదేశీ పరిశ్రమల పరిరక్షణ, ప్రతి ఏటా రెండు కోట్ల కొలువులు ఇస్తామని వాగ్దానాలు చేసి, కార్మిక వ్యతిరేక విధానాలతో కార్పొరేట్ కంపెనీలకు సేవ చేసిందని ఆయన తెలిపారు.
కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను మోడీ ప్రభుత్వం తీసుకొచ్చి కార్మిక హక్కులను కాల రాస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి తెలంగాణ అసెంబ్లీలో నాలుగు లేబర్ కోడలను అమలు చేయడం సాధ్యం కాదని తీర్మానం చేయాలని ఆయన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పి.ఎఫ్, ఈఎస్ఐ చట్టాలను కార్మికులకు వర్తింప చేయాలని ఆయన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.
మోడీ సర్కార్ ప్రభుత్వ రంగ సంస్థలను బహిరంగంగా వేలం చేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల మధ్య మత వివాదాన్ని సృష్టిస్తోందని ఆయన తెలిపారు.
సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య పాల్గొని మాట్లాడుతూ, ఉపాధి అయిన కాపాడండి లేదా తిండి అయినా పెట్టండని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ మౌలిక సమస్యల పరిష్కారం కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేయాలని ఆయన మరోసారి విజ్ఞప్తి చేశారు. భీడి పరిశ్రమలో ప్రధానంగా ఉన్న మహిళల ఆరోగ్య సమస్యలను పరిష్కరించడం కోసం ప్రత్యేకంగా కృషి చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
నిజామాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి భారీ ప్రదర్శన గా ధర్నాచౌక్ చేరుకొని బహిరంగ సభ గా మారింది.
ఈ సభలో
భీడి వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ భూమేశ్వర్, ధ్యక్షులు భూమన్న, ప్రధాన కార్యదర్శి సూర్య శివాజీ, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు జిల్లా ప్రధాన కార్యదర్శి జేపీ గంగాధర్, పాల్గొని ప్రసంగించారు. యూనియన్ జిల్లా నాయకులు శివకుమార్, పద్మ, సుప్రియ, పోశెట్టి, బాలయ్య, పాల్గొన్నారు. అరుణోదయ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సూరీబాబు,అబ్దుల్, కళాకారులు పాల్గొన్నారు.