*అధికారాన్ని అడ్డుపెట్టుకొని భూకబ్జాలకు పాల్పడుతున్న వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలి*
A9న్యూస్. ఇందల్ వాయి.
ఇందల్ వాయి మండలంలోని తుమ్మల రాజయ్య అలియాస్ నర్సింలు వ్యవసాయ సాగు భూమి సర్వే నంబర్ 1181/2 మొత్తం విస్తరణ రెండు ఎకరాల 8 గుంటల 4 సెంట్లు గలదు. నా పక్కనే ఉన్న పాశం పెద్ద గంగారం గారి వ్యవసాయ భూమిని ఉప్పల్వాయి రతన్ ఉప్పల్వాయి రాజేందర్ అనే ఇద్దరు సర్వేనెంబర్ 1171. పి గల భూమిని కొని పక్కనే ఉన్న 1181/2 గల నా భూమిపై కూడా కన్ను వేసి వారు ట్రక్టర్లతో సాగు చేయడం గమనించి అక్కడికి వెళ్లి అడ్డుకోగా వారు బెదిరిస్తూ ఎవరి ని తీసుకొస్తావో తెచ్చుకో ఈ భూమి మొత్తం నాది అని నా భూమిలో కూడా సాగు చేయడం మొదలుపెట్టారు. ఎన్నో చట్టాలు దళిత కోసం ప్రభుత్వాలు తెచ్చిన బడుగు బలహీన వర్గాల చట్టాలు కూడా లెక్కచేయకుండా నాలాంటి దళితునికి న్యాయం జరిపించాలని నాకు ఈ వ్యవసాయ భూమి తప్ప జీవించడానికి ఏమీ లేదని నాకు న్యాయం జరగకపోతే ఇదే వ్యవసాయ భూమిలో నా శవాన్ని చూస్తారని. ఆయన కోరడమైనది వారు నన్ను మా కుటుంబ సభ్యులను బెదిరించడంతో గ్రామ పెద్దలైన గ్రామ అభివృద్ధి కమిటీ కి సమాచారాన్ని అందించగా వారు చెప్పిన కూడా వినకుండా తన పని తను చేసుకుంటూ వెళ్లడంతో ఏమీ తోచక ఇందల్వాయి మండలం అధికారి ఎమ్మార్వో కు వినతిపత్రం ఇచ్చి తమ భూమిని తమకు విప్పించాలని కోరడమైనది కొన్నది కొంత ఆక్రమిస్తుంది కొండంత అని చూస్తే అర్థమయ్యే విధంగా కనిపిస్తుంది మండల లోని రాజేందర్ సన్నాఫ్ సాంబయ్య కుమారుడు ఆపరేటర్ గా పని చేస్తూ ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నాడని. ఎస్సీ వర్గ సభ్యులు తెలుపుతున్నారు తక్షణమే ఆయనపై తగు చర్యలు తీసుకోవాలని కోరడమైనది వాస్తవాలు లేకుండా ఒకరి భూమిని ఇంకొకరు కబ్జా చేయకుండా కాపాడాలని ఇందల్ వాయి ఎమ్మార్వో వెంకట్రావు ను కోరడమైనది