A9 న్యూస్ ఇందల్ వాయి జిత్తు బాయ్:
*పెట్రోల్ బంకులో అందుబాటులో లేని సదుపాయాలు…..
*త్రాగునీరు లో పురుగులు….
*తాళాలు వేసి ఉన్న టాయిలెట్లు…
*ఏర్ సదుపాయం నోచుకోని వాహనాదారులు…
*ఫస్ట్ యాడ్ కిట్టు కూడా అందుబాటులో లేదు…
ఇందల్ వాయి మండల కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్ పక్కన గల ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఏలాంటి ప్రమాణాలు లేకుండా నిర్వహిస్తున్న పెట్రోల్ బంక్ యాజమాన్యం. నిత్యం ఎంతో రద్దీగా ఉండే పెట్రోల్ బంక్ లో కనీస అవసరాలు లేకుండా అసౌకర్యాలతో ప్రజలను ఇబ్బంది పరుస్తున్న పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్నారని కనీస సౌకర్యాలు లేని పెట్రోల్ బంక్ మంచినీరు తాగుదామన్నా పురుగులతో నిండిన మంచినీరు, ఎయిర్ ఫ్రీ అని పెట్టి కూడా ఎయిర్ లేదనడం, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కూడా అందుబాటులో లేదు అలాగే మూత్రశాలలు తాళం వేసిన ఎలా వినియోగించుకుంటారని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. ప్రజలను మోసం చేస్తూ అన్ని సదుపాయాలు ఉన్నాయని చెప్పి అసౌకర్యాలతో ప్రజలను మోసం చేస్తున్న పెట్రోల్ బాంక్ యాజమాన్యంపై తక్షణమే చర్యలు తీసుకోవలని ప్రజలు కోరుతున్నారు.