A9 న్యూస్ ఆర్మూర్ ప్రతినిధి:
*గట్టి షరతులతో కూడిన ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు…
* హైకోర్టు ఆదేశాల మేరకు ఉత్తర్వుల స్టాంప్ సీల్ తొలగించిన ఆర్టీసీ అధికారులు…
* 8 రోజుల్లో అద్దె బకాయి 2.52 కోట్లు చెల్లించాలని అధికారుల ఆదేశాలు…
*వారంలో మొత్తం బకాయి చెల్లించాలి లేకపోతే మళ్లీ మాల్ సీజ్…
ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని ఆర్టీసీ స్థలంలో లీజుపై విష్ణుజిత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ వారు నిర్మించిన జీవన్ రెడ్డి షాపింగ్ మాల్ అండ్ మల్టీప్లెక్స్ స్థలానికి గాను ఆర్టీసీకి అద్దె బకాయి ఉన్న 2.52 కోట్ల అద్దె చెల్లించకపోవడంతో జీవన్ రెడ్డి మాల్ ను ఆర్టీసీ అధికారులు స్వాధీనo చేసుకున్న విషయం తెలిసిందే. శుక్రవారం విష్ణుజిత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ వారు హైకోర్టును ఆశ్రయించి గా షరతులతో కూడిన మద్యంతర ఉత్తర్వులను తీసుకువచ్చారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఆర్టీసీ అధికారులు స్వాధీనపరచుకున్న జీవన్ రెడ్డి మాల్ సీల్ ను ఆర్టీసీ అధికారులు తొలగించారు. ఈ మేరకు ఆర్మూర్ ఆర్టీసీ డిపో మేనేజర్ ఆంజనేయులు మాట్లాడుతూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల మేరకు షాపింగ్ మాల్ సీల్ తొలగిస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీకి అద్దె బకాయి ఉన్న 2.52 కోట్లను వారం రోజుల్లో చెల్లించాలని, లేనియెడల మళ్లీ జీవన్ జీవన్ రెడ్డి మాల్ ను స్వాధీనపరచుకుంటామని ఆయన వివరించారు. ఈ మేరకు యాజమాన్యంతో పాటు మాల్ లో ఉన్న దుకాణాదారుల సమక్షంలో ఆర్టీసీ అధికారులు వేసిన సీల్ ను తొలగించి సంబంధిత యాజమాన్యానికి అప్పజెప్పారు.