A9 న్యూస్ ఆర్మూర్ ప్రతినిధి:

ఆర్మూర్ పట్టణంలో మొన్న జరిగిన లోక్సభ ఎన్నికలలో మెప్మా ఆర్పి లకు వాలంటీర్లుగా పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా బిజెపికి చెందిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఎన్నికల బూతులు తిరుగుతూ డ్యూటీలో ఉన్న మహిళ ఉద్యోగి అయిన మెప్మా ఆర్పిని ఇష్టానుసారంగా బెదిరిస్తూ ఇక్కడి నుండి బయటికి వెళ్ళు గెట్ అవుట్ అని ఆమెను అట్టి బూతు నుండి బయటకు పంపించి వేశారు. ఆమె ఏం చెప్పినా వినిపించుకోకుండా గట్టిగా బెదిరిస్తూ పంపించారు. అక్కడి నుండి ఆమె ఏడుస్తూ వెళ్లి మనస్థాపానికి గురైనారు. ఆమె సార్ మాకు మున్సిపల్ కమిషనర్ డ్యూటీ వేశారు అని ఎంత చెప్పినా వినకుండా మీ ఆర్పి లకు ఇక్కడ ఏం పని ఎందుకు వచ్చారు అని ఆమెను అందరి ముందు అవమానించాడు ఎమ్మెల్యే మాటలకు మనస్థాపానికి గురైన మహిళా ఉద్యోగి తాను చేస్తున్న ఆర్పి పనికి రాజీనామా చేశారు.

ఎవరి భర్తలైనా రాజకీయాల్లో ఉంటే వారి భార్యలు జాబులు చేయకూడదా ?

రాజకీయాల్లో ఉన్న వ్యక్తుల భార్యలు జాబులు చేయడం?

లేదా అని ప్రశ్నించారు భర్తలు రాజకీయాల్లో ఉంటే వారి భార్యలను ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇలాగే అవమానిస్తారా అని అడిగారు న్యాయం కోసం ధర్మం కోసం పనిచేస్తానని చెప్పిన రాకేష్ రెడ్డి ఆడవారి తో మాత్రం ఎలా మాట్లాడాలో తెలియదా అని అన్నారు. ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి అందరిని సమానంగా చూడాలని ఇలా కించపరిచేలా ప్రవర్తించకూడదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా తన రాజీనామాకు మాత్రం ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కారణం అని ఆమె అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *