A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
*మతోన్మాద,ఫాసిస్టు బిజెపిని పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించండి….
*ఇండియా కూటమి అభ్యర్ధి జీవన్ రెడ్డికి మద్దతు ఇవ్వండి….
*సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు పిలుపు….
ఆర్మూర్ మండలంలోని మేడిదపల్లి ఉపాధి హామీ కార్మికుల ను ఉద్దేశించి సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు లు మాట్లాడుతూ…. “ఉపాధి హామీ కార్మికుల కనీస సౌకర్యాలు కల్పించటంలో మోడీ ప్రభుత్వం విపలమై, ఈ పథకాన్ని ఎత్తివేసే కుట్ర చేస్తుందని వారన్నారు. ఈ స్కీములలో దాదాపు కోటి మందికిపైగా ప్రజలు పని చేస్తున్నరనీ, వారికి పనిరోజులు పెంచి కూలీ పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. ఎన్నికల్లో మోడీ ఇచ్చిన వాగ్దానాలను విస్మరించి, ప్రభుత్వ సంపదను పెట్టుబడిదారులకు అప్పజెప్పే కుట్ర చేస్తున్నారని వారు అన్నారు. ప్రశ్నించే కవులను, కళాకారులను, మేధావులను నిర్బంధించడమే కాకుండా దాడులు చేసి హత్యలకు పాల్పడుతుందని వారు తెలిపారు. రైతు, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబించడమే కాకుండా, ప్రజలను మతం పేరుతో విభజిస్తుందని, మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న వారి పైన “ఉపా”లాంటి ఇతర క్రిమినల్ చట్టాలను పెట్టి జైల్లో నిర్బంధి స్తోందని వారు తెలిపారు. గోబెల్స్ మించి అబద్దాలతో ప్రజల ఆలోచనలు వక్రమార్గం పట్టించే కుట్ర ,కుతంత్రాలు బిజెపి చేస్తుందని వారన్నారు.ప్రతిపక్ష పార్టీల పైన సిబిఐ, ఈడి, ఐటి లాంటి సంస్థలను ప్రయోగించి ఆ పార్టీల నాయకులను లొంగదీసుకునే కుయుక్తులు పన్నుతుందని వారు తెలిపారు. ఎలక్ట్రోరల్ బాండ్స్ ద్వారా విరాళాలన్నిటిని తమ బ్యాంక్ అకౌంట్ లో వేయించుకొని, ప్రతిపక్ష కమ్యూనిస్టు విప్లవ పార్టీలకు విరాళాలు ఇవ్వకుండా బెదిరిస్తోందని వారు తెలిపారు.
ఉపాధిని కొల్లగొట్టి, సరుకుల ధరలను పెంచి, జీవన ప్రమాణాలను దెబ్బ తీసి, దేశాన్ని అప్పుల కొంపగా మార్చిన బిజెపి నరేంద్ర మోడీని ఓడించి తగిన తీర్పు ఇవ్వాలని ప్రజలను వారు కోరారు.
ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించి, కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పి , కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను తెచ్చి, ప్రజా జీవితాన్ని అందాకారంగా మార్చుతోందని వారు అన్నారు. ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలుకు పూనుకుంటూ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చేయాలని కుట్ర చేస్తోందని వారు అన్నారు. జీవించే హక్కును హరిస్తున్న మతోన్మాద, ఫాసిస్టు బిజెపి కూటమిని ఓడించి, ఇండియా కూటమి అభ్యర్థి జీవన్ రెడ్డి కు గెలిపించాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ప్రచార క్యాంపెన్లో పార్టీ నాయకులు సూర్య శివాజీ, ఎస్ వెంకటేష్, గోవింద్ పెట్ సాయన్న, ప్రిన్స్, ధనలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.