A9 న్యూస్ ప్రతినిధి ఇందల్వాయి:
ఇందల్వాయి మండలంలోని తీర్మాన్ పల్లి గ్రామంలో గురువారం ఉపాధి హామీ కూలీల వద్దకు బిజెపి కార్యవర్గ సమావేశం టీం ప్రచార కమిటీ మొత్తం వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసినటువంటి అభివృద్ధి పనులు వారికి వివరించి మరి ముచ్చటగా మూడోసారి ఆయనను ప్రధానమంత్రి చేయాలంటే ముందుగా మీరందరూ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కి ఓటు వేసి ఆయనను పెద్ద మెజార్టీతో గెలిపించుకోవాలని వారు కోరారు. వెంటనే కూలీల లో కొందరు మన భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టడం మన భారతీయులందరం చేసుకున్నటువంటి పుణ్యఫలం తప్పకుండా ఆయనకు కూలీలందరూ ఓటు వేస్తారని ఆయనను మూడోసారిగా ప్రధానమంత్రి చేస్తామని వారు ధీమా వ్యక్తం చేశారు. గల్లీలో ఎవరున్నారో తెలియదు కానీ ఢిల్లీలో మాత్రం తప్పకుండా నరేంద్ర మోడీ ఉండాలని వారు మాట ఇచ్చారు ఇంకొందరు కూలీలు మాట్లాడుతూ మన భారతదేశం ఇంత శాంతియుతంగా ప్రపంచం మెచ్చుకునేలా ఉందంటే దానికి కేవలం మన ప్రధానమంత్రి కారణమని కరోనా కష్ట కాలాల్లో కూడా ఉన్నవాడు లేనివాడు అని చూడకుండా అందరిని ఆదుకున్న ఓకే గొప్ప వ్యక్తి ఆయన కోసం ఈసారి ఓటు వేయకపోతే మేము హిందువులమే కాము అని వారు కితబుపలికారు ఇంకొందరు మాట్లాడుతూ గత ఎంపీ అరవింద్ 50 వేల, ఓట్ల మెజార్టీతో గెలిచారని ఈసారి ఆయనకు లక్ష ఓట్లు మెజార్టీ వచ్చేలా ప్రతి రైతు ప్రతికూలి ఆయనకు ఓటు వేసి గెలిపిస్తారని మాట ఇచ్చారు, మరి గన్నారం మాజీ సర్పంచ్ కుంట మోహన్ రెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోడీ పథకాల గురించి వారికి వివరించారు. వారిని ఈసారి గెలిపించుకోకపోతే మనం మరో వంద సంవత్సరాలు వెనుకబడిపోతామని మనం ప్రపంచంలో నే అందరికంటే అభివృద్ధి బాటలో నడుస్తున్నామంటే కారణం ఒక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కారణమని ఆయన ప్రజలకు వివరించారు దీంతో అక్కడ ఉన్న సుమారు 200 మంది కూలీలు ఈ మాట విన్న వెంటనే జై శ్రీరామ్ జై నరేంద్ర మోడీ జై బిజెపి అన్న నినాదం వారిలో కనబడింది ఇందులోని భాగంగా ఎల్లారెడ్డి పల్లె మాజీ సర్పంచ్ మాజీ ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థి మటమల శేఖర్ మాట్లాడుతూ నేను చేసిన సర్పంచి పదవి కావచ్చు స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన గత సంవత్సరం నాకు బిజెపి ద్వారా కార్యకర్తలు మరియు ప్రజలు నన్ను బీజేపీలోకి రమ్మని మీలాంటివారు బిజెపిలో ఉండడం మాకు చాలా అవసరమని వారు కోరడంతో నేను కూడా తక్షణమే ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కోసం నా వంతు సహాయం చేద్దామనే ఉద్దేశంతో ఆయన గెలిస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవుతారని ఆయనను గెలిపించుకోవాలని నా వంతు కష్టం కూడా నేను తిరుగుతూ ప్రతి గల్లీలో కమలం పువ్వుకు ఓటు వేసే విధంగా ప్రజల్ని మెప్పిచ్చి ఒప్పించి వారిని మన భారతీయ ప్రజలు అని గుర్తు పెట్టుకోవాలంటే మనం ముందుగా బిజెపి పార్టీకి ఓటు వేయాలి మన భారత దేశంలో ఏ పథకాలు కావాలన్నా భారతదేశం ముందంజు ఉండాలంటే ముందుగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి కావాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో భాగంగా కేపీ రెడ్డి, మటమల శేఖర్, కుంట మోహన్ రెడ్డి, పోచంపల్లి మహేష్, గొల్ల ప్రసాద్, మేకల ప్రశాంత్, అన్నారం ప్రవీణ్, ఇంకా బిజెపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.