A9 న్యూస్ ఇందల్వాయి ప్రతినిధి:
దాతలు ముందుకు రావాలి
ఇందల్ వాయి మండలంలోని తీర్మాన్ పల్లి గ్రామానికి చెందిన కలిగోట లక్ష్మి 55 అనే మహిళ వేట్టి కూలి పని చేస్తూ జీవనం కొనసాగించేది అకస్మాత్తుగా ఆమె మరణించడంతో ఆమెకు ఎటువంటి ఆధారం లేనందున ఉన్న ఒక కూతురు ఊరిలో వెట్టిచ్చేకిరి చేస్తూ జీవనం కొనసాగిస్తుంది. ఇంతలో ఆమె తల్లి మరణించడంతో తీర్మాన్ పల్లి గ్రామంలో ఉన్నటువంటి రజక కులస్తులు ప్రతి ఇంటి నుండి చందాలు వేసుకుని ఆమె అంత్యక్రియలకు చేశారు.
లక్ష్మి కూతురు వనజ (25) మతిస్థితి సరిగా లేదు మరియు ఆమెకు ఇల్లు కూడా లేదు తీర్మాన్ పల్లి వెంకటేశ్వర స్వామి గుడి వెనకాల ఒక చిన్న గుడిసె వేసుకొని జీవిస్తున్న ఆ కుటుంబం లో ఓ పెద్ద విషాదం చోటుచేసుకుంది. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఆమెకు సహకరించగలరని వారి కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.