Friday, November 29, 2024

పోలీస్ శాఖ ఆద్వర్యంలో డా॥ బి.ఆర్. అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు

spot_img
- Advertisement -spot_imgspot_img
- Advertisement -spot_imgspot_img

A9 న్యూస్ నిజామాబాద్ ప్రతినిధి:

నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కల్మేశ్వర్ సింగెనవర్, ఐ.పి.యస్. ఆదేశానుసారంగా ఆదివారం ఉదయం నిజామాబాద్ కమీషనరేట్ కార్యాలయంలో అదనపు డి.సి.పి (అడ్మిన్ ) బి.కోటేశ్వరరావు, అదనపు డి.సి.పి (ఎ.ఆర్ ) డి. శంకర్ నాయక్, మరియు ఎ.ఎస్.పి శేషాద్రిని రెడ్డి, ఐ.పి.యస్., లు హజరయి 

డా॥ బి.ఆర్.అంబేద్కర్ ఫోటోకు పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించడం జరిగింది.

    అనంతరం అధికార్లు మాట్లాడుతూ డా|| బి.ఆర్. అంబేద్కర్ సామాన్యనిరుపేద కుటుంబంలో జన్మించి నప్పటికి తన అపార మేధాశక్తులతో సమాజంలోని రుగ్మతలను దూరం చేసేందుకు పాటుపడిన మహనీయుడని, దళితుల అభ్యున్నతికి నిరంతరం కృషిచేసి సమాజంలోని అంటరాని తనము మరియు అసమానతలు రూపుమాపుటకు ఎంతో తొడ్పడిన ఘనత డా॥ బి.ఆర్. అంబేద్కర్కు దక్కుతుందని భారత రాజ్యాంగ నిర్మాత డా॥ బి.ఆర్.అంబేద్కర్, దేశానికి అందించిన సేవలు మరువరానివని, ప్రపంచ దేశాలలోనే కీర్తించబడే అతి పెద్ద భారత రాజ్యాంగాని రచించి ప్రజా స్వామ్య విలువలను పెంపొందించి, దళితులకు ప్రభుత్వం అందిస్తున్నసంక్షేమఅభివృద్ధి పథకాల గురించి విస్తరంగా ప్రచారంచేసి వాటిని సద్వినియోగపరిచే విధంగా ప్రతిఒక్కరు కృషి చేయాలని, డా॥ బి.ఆర్. అంబేద్కర్ అందించిన ఫలాలలో నేడు అనగారిన వర్గాలు రిజర్వేషన్ సౌకర్యాలు పొందుతు సమాజంలోని ఇతర వర్గాలతో సమానంగా అభివృద్ధి చెందెందుకు ఆస్కారం చేసేందుకు ఎంతో కృషిచేసిందని . డా॥ బి.ఆర్. అంబేద్కర్ రచించిన రాజ్యాంగము ఆధారంగానే ప్రస్తుతం దేశంలో చట్టాలు సమర్ధవంతముగా అమలు అవుతున్నాయని, ప్రతిఒక్కరు డా॥ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి చేయాలని, అగ్ర వర్ణల దాడులకు గురైన బాదితులకు సత్వరన్యాయం అందించుటకు “పోలీస్ శాఖ” నిరంతరం చిత్త శుద్దితో కృషి చేస్తుందని తెలియజేసారు.

   ఈ సందర్భంగా ఆర్మూడ్ రిజర్వు ఎ.సి.పి కె. నాగయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్ పెక్టర్ శ్రీశైలం, ఆఫీస్ సూపరింటెండెంటు శంకర్, రిజర్వు ఇన్స్పెక్టర్స్ వెంకట్ (అడ్మిన్) , శ్రీనివాస్ (వెల్ఫేర్), ఐ.టి కోర్ సిబ్బంది, సి.సి.ఆర్.బి సిబ్బంది. పోలీస్ కంట్రోల్ రూమ్ సిబ్బంది, సెంట్రల్ కాంప్లెంటు సెల్ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది హోమ్ గార్డ్సు సిబ్బంది పాల్గొన్నారు.

+ posts
- Advertisement -spot_imgspot_img
Latest news
spot_img
- Advertisement -spot_img
Related news
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here