A9 న్యూస్ నిజామాబాద్ ప్రతినిధి:
మెండోరా మండలం సోన్పేట గ్రామంలో ఆనంద ఆదివారం హ్యాపీ సండే ధ్యానాత్మ జ్ఞాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా, జ్ఞానదాతగా శ్రీ తట్టవర్తి వీర రాఘవరావు భీమవరం నుండి విచ్చేసి అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశం అందించారు. మానవులందరూ ధ్యానం చేసి ఆత్మజ్ఞానం పొందితేనే జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకుంటారని తెలిపారు.
దుఃఖం నుండి నిరాశ నుండి ఆనందం వైపు ప్రయాణించాలంటే జీవితంలో ఆనందంగా ఐశ్వర్యంగా సుఖంగా సంతోషంగా ఉండాలంటే కేవలం ధ్యానం ద్వారానే సాధ్యమవుతుందని చెప్పారు.
ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని, శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయడం వల్ల ఆత్మజ్ఞాన లభిస్తుందని తెలిపారు.
జీవితంలో దుఃఖం నిరాశ ఉండకూడదు అంటే ధ్యానం చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న 300 మంది ధ్యానులకు సోన్ పేట పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యానమృతం అందించారు.
ఈ కార్యక్రమంలో పి ఎస్ ఎస్ ఎం నిజామా బాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి, ముఖ్య సలహాదారులు బొడ్డు దయానంద్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ అమరవాజి శ్రీనివాస్, కార్యనిర్వాహక కార్యదర్శి ప్రేమ్ సాగర్, భీమన్న, ఆర్మూర్ ప్రవీణ్ కుమార్, బోదేపల్లి రాజు, చౌటి శ్రీనివాస్, దేవేందర్ రెడ్డి, 300 మంది పాల్గొన్నారు.