A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్:
భారత దేశానికి తొలి కార్మిక మంత్రి బాబాసాహెబ్ అంబేడ్కర్. ఆయన అధీనంలో కోట్ల మందికి పర్మనెంట్ జాబులు లభించాయి. పీడిత ప్రజలకు అనేక కార్మిక సంక్షేమ సౌకర్యాలు కల్పించిన నిజమైన దేశభక్తుడు అంబేడ్కరుడు అంటూ “మజ్దూర్ మజ్దూర్ భాయి భాయి కాంగార్ యూనియన్” నేత రమేష్ చౌవల్ కొనియాడారు. అయితే నేడు అదే భారత రాజ్యాంగం సురక్షితంగా లేదు కావున దాని రక్షణ కోసం మనమందరం పెద్ద ఎత్తున ఉద్యమించాలని రమేష్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఆదివారం ముంబై పశ్చిమ విలేపార్లె నాకా (అడ్డా) వద్ద యూనియన్ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేడ్కర్ 133వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆరంభంలో అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రతి కార్మికుడు చేతులెత్తి సెల్యూట్ చేశారు. జైభీం జైజై భీం నినాదాలతో ప్రాంగణం మారుమోగింది. తదుపరి ప్రఖ్యాత తెలుగు గాయకులు గాజుల నర్సరెడ్డి, భీంరత్న మాలజీ లు బహుజన కష్టజీవుల పాటలతో ఉర్రుతలు ఊగించారు. ఇందులో యూనియన్ నేతలు తాటిపెల్లి బాబు మహారాజ్, శ్రీరాం కాశయ్య, బందేల బాబు, దోమకొండ రాజేశ్వర్, విజినాథ్ గైక్వాడ్, భాస్కర్ నరవడే, ముఖేష్ కుమార్, జాహినుద్ధిన్, బహుజన మేధావి మూల్ నివాసి మాలజీ తదితర్లు పాల్గొన్నారు.