A9 న్యూస్ నందిపేట్ ప్రతినిధి ఏప్రిల్ 15:
నందిపేట మండలం చింరాజ్ పల్లి గ్రామంలో మన కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి తాటిపత్రి జీవన్ రెడ్డి ని గెలిపించాలని ప్రచారంలో పాల్గొన్న ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి.
ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ అభ్యర్థి తాడిపత్రి జీవన్ రెడ్డి రైతు నాయకులు ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడు కాబట్టి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన ఆరు పథకాలలో నాలుగు పథకాలను అమలుపరుస్తూ రానున్న రోజుల్లో మిగతా రెడ్డి పథకాలు కూడా అమలు చేస్తారని చెపుతూ, మహిళలకు ఉచిత బస్సు, మహాలక్ష్మి పథకం కింద సిలిండర్ 500 రూపాయలకు, ఆరోగ్యశ్రీ పథకం కింద పది లక్షల రూపాయలు, గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ప్రతి ఇంటికి ఉచిత కరెంటు, ఇదే కాక రానున్న రోజులలో ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇల్లు ఇప్పించే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీది, నాది అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో నందిపేట మండల అధ్యక్షులు మంద మైపాల్, చింరాజ్ పల్లి ఎంపిటిసి శ్రీనివాస్,మాజి సర్పంచ్ గణేష్, డిసిసి ఉపాధ్యక్షులు కంఠం ఇంద్రుడు, దెగాం గంగారెడ్డి, చింరాజ్ పల్లి పిఎసిఎస్ సొసైటీ ఛైర్మెన్ బొంకమ్ గంగారెడ్డి, మారంపల్లి లిఫ్ట్ ఛైర్మెన్ భోజ రెడ్డి, సొసైటీ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ, డొంకేశ్వర్ మాజి సర్పంచ్ చందు, తొండకూర్ మాజి సర్పంచ్ దేవన్న, జి ఆర్, తల్వేద మాజి సర్పంచ్ సాయినాథ్ గౌడ్, డొంకేశ్వర్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు భూమేష్ రెడ్డి, వన్నెల్ కె మాజి పిఎసిఎస్ ఛైర్మెన్ లోక హన్మాండ్లు, ఐలాపూర్ పిఎసిఎస్ మాజి ఛైర్మెన్ లక్ష్మీ నారాయణ, డొంకేశ్వర్ మాజి సర్పంచ్ హరి దాస్, జి జి నడకూడ మాజి సర్పంచ్ బంటు సంజీవ్, మాన్పుర్ భూమేష్, కొండూరు పోశెట్టి, గంగ సాయులు, మల్లు మురళి, దిపేట్ మండలం మైనారిటీ అధ్యక్షులు యూసుఫ్, ఉమ్మెద బీజన్న, గంగాధర్ తల్వేద శ్రీనివాస్, మరియు మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.