A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆర్మూర్ పట్టణ కేంద్రంలో పీ.డి.ఎస్.యూ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ జార్జిరెడ్డి 52వ వర్ధంతి సందర్భముగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగిందని ఆర్మూర్ డివిజన్ అధ్యక్షులు ప్రిన్స్ అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉస్మానియా అరుణతార, హైదరాబాద్ చేగువేరా పి.డి.ఎస్.యూ వ్యవస్థాపకులు కామ్రేడ్ జార్జ్ రెడ్డి నాయకత్వాన ఉస్మానియా యూనివర్సిటీలో పి.డి.ఎస్.యూ విద్యార్థి సంఘం పురుడు పోసుకున్నదాని, క్యాంపస్ లో మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా, యూనివర్సిటిలో విద్యార్థులు ఎదురుకుంటున్న సమస్యలపై నిరంతరం పోరాటం చేశారని చివరివరకు విద్యార్థుల హక్కుల కోసం పోరాడి ఆమరుడు ఆయ్యడు మరియు అతను ఓకే గొప్ప విద్య వేత్త అన్ని నూక్లియర్ ఫిజిక్స్ లో గోల్డ్ మెడల్ పొందిన వేక్తి అన్ని అందుకే జార్జ్ రెడ్డి జీవిత చరిత్రను విద్యార్థుల పాఠ్యాంశాల్లో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. మరియు నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విద్యను నిర్వీణ్యం చేసే విధానాన్ని అవలంబిస్తున్నారని అందుకే విద్యారంగానికి తక్కువ నిధులు, ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు ఇవ్వకూడ పూర్తిగా ప్రైవేటీకరణ చేస్తున్నారు మరియు కేంద్ర ప్రభుత్వం విద్యారంగాన్ని కాషాయీకరించే కుట్రలో భాగంగా నూతన జాతీయ విద్యా విధానం 2020 తీసుకువచ్చారని అన్నారు. కామ్రేడ్ జార్జి రెడ్డి ఉద్యమస్ఫూర్తితో మతోన్మాద ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా మరియు విద్యార్థుల హక్కుల కై ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యూ నాయకులు అక్షయ్, వెంకటేష్, సిద్దార్థ్, నితిన్, రక్షిత, మనోజ్, కార్తీక్, జశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.