A9 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల్ తుక్కోజివాడి గ్రామంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో డా బి ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా* నిర్వహించడం జరిగింది_

 ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘ సభ్యుడు కడతాల సతీష్ మాట్లాడుతూ డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి 133వ జయంతి జరుపుకోవడం అభినందనీయమని అన్నారు. డబ్బు, అధికారం, కులం, మతం అన్ని రంగాల్లో పెత్తనం చెలాయిస్తున్న నేటి పరిస్థితుల్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను మరింత నిబద్ధతతో అమలు చేయాల్సిన అవసరాన్ని చెబుతున్నాయి. రాజకీయాలు వ్యాపారంగా మారిపోయాయి. పార్టీలు పేద, బడుగు, బలహీన వర్గాలను ఓటు బ్యాంకుగా మాత్రమే గుర్తిస్తున్న నేపథ్యంలో రాజనీతి దార్శనికుడు, బడుగుల ఆశాజ్యోతి, బహుజనుల దేవుడు బాబాసాహేబ్ అంబేద్కర్ సిద్ధాంతాలను, ఆశయాలను మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *