A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్:
సిపిఎం ఆధ్వర్యంలో బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమం ఆదివారం 133వ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని పులాంగ్ చౌరస్తా వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఏ.రమేష్ బాబు మాట్లాడుతూ భారత పాలకులు భారత రాజ్యాంగానికి తూర్పు పొడిచే పద్ధతుల్లో పాశ్చాత్య సంస్కృతి ద్వారా మనువాద సిద్ధాంతాన్ని అమలు జరపాలని అందుకోసం రాబోయే ఎన్నికల్లో మూడోసారి గెలిపించి ప్రధానమంత్రిని చేయాలని ప్రయత్నిస్తున్నారని. దీన్ని భారత ప్రజలందరూ ఐక్యంగా తిప్పి కొట్టాలని ప్రజల్లో మత విద్వేషాలను పెంచి బిజెపి అధికారంలోకి రావాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు ప్రజల్లో ఉన్న తారతమ్యాలను తొలగించి అందరూ కలిసి మెలిసి ఉండాలని అంటరానితనం పేద గొప్ప అనే తేడా ఉండకూడదని బిఆర్ అంబేద్కర్ ఈ సమానమైన హక్కులను కల్పిస్తూ భారత రాజ్యాంగాన్ని రూపొందిస్తే నేటి పాలకులు ప్రజల్లో విద్వేషాలను పెంచి పాశ్చాత్య సంస్కృతిని అమల్జర్పటానికి ప్రయత్నిస్తున్నారని దాన్ని తిప్పి కొట్టినప్పుడే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలు ఇచ్చిన వాళ్ళం అవుతామని ఆయన అన్నారు. భారత రాజ్యాంగ పరిరక్షణకై అందరూ ఐక్యంగా కదలాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్ రాములు, నూర్జహాన్, జిల్లా కమిటీ సభ్యులు పి.సూరి, విగ్నేష్, నగర నాయకులు కటారి రాములు, నల్వాల నరసయ్య, మహేష్, కృష్ణ, దీపిక, తదితరులు పాల్గొన్నారు.