A9 న్యూస్ ఆర్మూర్ ప్రతినిధి: 

ఆర్మూర్ పట్టణంలోని (పెర్కిట్) కోటార్మూర్ గ్రామానికి చెందిన హనుమాన్ దీక్ష తీసుకున్న స్వాములు హిందూమత పరిరక్షణకై భారతదేశంలో వివిధ రాష్ట్రాలలో ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు అయిన అరుణాచలం, కాణిపాకం, శ్రీకాళహస్తి, తిరుపతి, అన్నవరం, విజయవాడ కనకదుర్గ వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా హనుమాన్ భక్త స్వాములు మాట్లాడుతూ హనుమాన్ దీక్షలో ఉన్న సమయంలో భక్తి భావంతో ఉండడం వలన ఈ పుణ్యక్షేత్రాల దైవ దర్శనాలు చేసుకోవడం ఎంతో పుణ్యకార్యమని ఇలాంటి అవకాశం మాకు దక్కడం ఎంతో ఆనందం అని ఇలాంటి అవకాశాలు మళ్లీ మళ్లీ రావాలని ఇలాంటి పుణ్యక్షేత్రాలు మరెన్నో దర్శించుకునే భాగ్యం మాకు ఆ భగవంతుడు కలిగించాలని హిందూ దేవాలయ పరిరక్షణకై ప్రతి ఒక్క హిందువు దర్శించుకోదగ్గ ఈ పుణ్యక్షేత్రాలని వారు తెలిపారు. ఇవే కాకుండా మన భారత దేశంలో చాలా ప్రసిద్ధిగాంచినటువంటి పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయని వాటన్నింటిని దర్శించుకునే భాగ్యం భగవంతుడు మాకు కలిగించాలని మేము కోరుకుంటున్నాం భక్తి భావనలతో చేసే కార్యం ప్రతి ఒక్కటి విజయం సిద్ధిస్తుందని వారు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *