A9 న్యూస్ నందిపేట్ ప్రతినిధి:
నందిపేట్ మండల కేంద్రంలో నందిపేట్ మండల భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో ప్రపంచ మేధావి భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా జయంతి కార్యక్రమం నిర్వహించి తాడిత పీడిత బడుగు బలహీన వర్గాల కోసం సమసమాజ స్థాపన కోసం సర్వ మానవ సౌబ్రాతృత్వాన్ని నిర్మించడం కోసం ఆయన జీవితాంతం చేసిన కృషిని కొనియాడి ఆయన విగ్రహానికి పూలమాలవేసి ఆయన ఆశయ సాధనలో భారత రాష్ట్ర సమితి పార్టీ ముందుంటుందని తెలంగాణ రాష్ట్ర తొలి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం అనుగుణంగా చిన్న రాష్ట్రాలు దేశ ప్రగతికి మూలమని అంబేద్కర్ ఏర్పరిచిన రాష్ట్ర పునర్విభజన చట్టం 1956 ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. దేశంలో ఈ యాక్ట్ ప్రకారం 14 రాష్ట్రాలు ఏర్పడ్డాయని తెలంగాణ తొలి మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కృషి వల్లనే తెలంగాణ రాష్ట్రం సాధించిన రాష్ట్రాన్ని అతి తక్కువ సమయంలో దేశంలోని నెంబర్వన్ రాష్ట్రంగా నిలుపామని భారత రాష్ట్ర సమితి పార్టీ నందిపేట మండల అధ్యక్షులు మచ్చర్ల సాగర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి ఎర్రం యమునా ముత్యం, కోఆప్షన్ మెంబర్ సయ్యద్ హుస్సేన్, ఉప సర్పంచ్ భరత్, మాజీ ఎంపీటీసీలు బాలగంగాధర్, సీనియర్ నాయకులు హస్నొద్దీన్ వార్డ్ మెంబర్ సాయిలు, పాషా, నాని, బీఆర్ఎస్ యువ నాయకులు గంధం రాజశేఖర్, జోరుపూర్ రాము, దర్వాడి అశోక్, ఉమ్మడఅశోక్, ఎడ్డి గారి నరేష్, విజయనగర్ నరేష్, రాజేశ్వర్, వాజిద్, సాయి, శీను, ముత్యం, సంతోష్, సతీష్, వినయ్, రోహిత్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిదులు తదితరులు పాల్గొన్నారు.